News December 1, 2025
NGKL జిల్లాలో తగ్గిన చలి

నాగర్‌కర్నూల్ జిల్లాలో నిన్నటితో పోలిస్తే చలి తీవ్రత కొద్దిగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో అమ్రాబాద్ మండలం వటవర్లపల్లిలో 18.1°C కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బిజినేపల్లిలో 18.3°C, తోటపల్లిలో 18.5°C, ఊర్కొండ, వెల్దండలలో 18.6°C, తాడూరులో 18.7°C, చారకొండ మండలంలో 18.8°C కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
Similar News
News March 30, 2026
ఈనాటి ముఖ్యాంశాలు

* సంక్షోభం వేళ స్వార్థపూరిత రాజకీయాలు చేయొద్దు: మోదీ
* IPL: KKRపై MI ఘన విజయం
* హైదరాబాద్‌ను మించిన రాజధానిగా అమరావతి: CBN
* క్రెడిట్ చోరీ జబ్బు నుంచి జగన్ కోలుకోవాలి: లోకేశ్
* నటనతో మెప్పించిన TG MLA, MLCలు
* పొంగులేటిని బర్తరఫ్ చేయాల్సిందే: కేటీఆర్
* ఉద్యోగుల జవాబుదారీతనం బిల్లుకు TG అసెంబ్లీ ఆమోదం
* BJP వస్తే మాంసం, గుడ్లు తిననివ్వదు: మమతా బెనర్జీ
News March 30, 2026
‘బైకర్’ కోసం రోజూ 32కి.మీ. రన్నింగ్!

‘బైకర్’ మూవీ కోసం రెండేళ్ల పాటు సూర్యోదయం కంటే ముందే తన డైలీ రోటీన్ ప్రారంభమయ్యేదని నటుడు శర్వానంద్ తెలిపారు. ఈ చిత్రంలోని క్యారెక్టర్ కోసం ఒకానొక సమయంలో డైలీ 32KM మేర రన్నింగ్, వాకింగ్ చేసినట్లు చెప్పారు. యోగా, ప్రాణాయామం కూడా ప్రాక్టీస్ చేశానన్నారు. దీంతో 7 కిలోల వరకు తగ్గినట్లు చెప్పారు. ఆపై బైకర్ పాత్రను అవగాహన చేసుకొని ఇంకా బరువు తగ్గినట్లు చెప్పారు. ‘బైకర్’ APR 3వ తేదీ రిలీజ్ కానుంది.
News March 30, 2026
అలాంటి యాడ్స్‌పై నిషేధం: రైల్వే శాఖ

లిక్కర్, పొగాకు, ధూమపానం వంటి అభ్యంతరకర ప్రకటనలను రైళ్లలో ప్రదర్శించడంపై నిషేధం విధించినట్లు రైల్వే శాఖ తెలిపింది. ‘స్టేషన్లు, రైళ్లలో(కోచ్‌ల లోపల, బయట) యాడ్స్ విషయంలో నైతిక విధానాన్ని అనుసరిస్తాం. ఎలాంటి ఎరోటిక్ కంటెంట్ ప్రదర్శించం. రైలు ప్రమాదాలపై పాలసీలను అందించే ప్రైవేటు బీమా కంపెనీల యాడ్స్ తీసుకోం. అన్ని ప్రకటనలను ఈ-వేలం ద్వారానే ఏజెన్సీలకు కేటాయిస్తాం’ అని వివరించింది.


