News February 9, 2026
NGKL: జిల్లాలో ముగిసిన మున్సిపల్ ప్రచారం

జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ఎన్నికల బహిరంగ ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా, అభ్యర్థులు ఇంటింటి ప్రచారంపై దృష్టి పెట్టారు. మైకులు మూగబోవడంతో పోలీసులు మద్యం, నగదు పంపిణీపై గట్టి నిఘా ఏర్పాటు చేశారు. 13న ఫలితాలు వెలువడనున్నాయి.
Similar News
News February 12, 2026
సంగారెడ్డి: స్ట్రాంగ్ రూమ్ వద్ద అప్రమత్తంగా ఉండాలి: డీఐజీ

సంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో, బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచే వరకు అప్రమత్తంగా ఉండాలని డీఐజీ చౌహాన్ ఆదేశించారు. కంట్రోల్ రూమ్ పనితీరును పరిశీలించిన ఆయన, ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన ఎస్పీ పారితోష్ పంకజ్, టెక్నికల్ టీంను అభినందించారు. బాక్సుల తరలింపులో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు.

KNR: ‘సమ్మెని విజయవంతం చేయాలి’

KNRలో తెలంగాణా మెడికల్ & సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ (TMSRU) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాను కిరణ్ మాట్లాడుతూ.. FEB 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కొత్త లేబర్ చట్టాలు, పలు డిమాండ్లతో దేశ వ్యాప్తంగా పనిచేస్తున్న మెడికల్ & సేల్స్ రిప్రజెంటేటివ్స్ సభ్యులు పాల్గొంటారని తెలిపారు.