News January 3, 2026

NGKL జిల్లాలో యూరియా నిల్వలు ఇలా..!

image

నాగర్ కర్నూల్ జిల్లాలో జిల్లాలో 39,667 యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. అచ్చంపేటలో 1,395, అమ్రాబాద్‌లో 228, బల్మూర్ 919, బిజినేపల్లి 2,733, చారకొండ 1,708, కల్వకుర్తి 8,366, కోడేరు 1,400, కొల్లాపూర్ 6,041, నాగర్ కర్నూల్ 2,328, వంగూరు 882, పదర 313, పెద్దకొత్తపల్లి 2,648, పెంట్లవెల్లి 1,862, తెలకపల్లి 2,250 ఉన్నట్లు తెలిపారు.

Similar News

News January 5, 2026

వరంగల్: భద్రకాళమ్మా.. శరణు.. శరణు..!

image

తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన వరంగల్‌లోని భద్రకాళి ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. నేడు సోమవారం కావడంతో అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేస్తున్నారు. భక్తులు ఉదయాన్నే ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శరణు.. శరణు తల్లి అంటూ వేడుకుంటున్నారు. పలువురు భక్తులు ఆలయ పరిసరాల్లో సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.

News January 5, 2026

HYD: JAN 5- 12 మధ్య కోల్డ్ వేవ్ 2.0

image

నగరం, శివారులో కొన్ని రోజులుగా మంచు తీవ్రంగా కురుస్తున్నా చలి నుంచి కాస్త ఉపశమనం లభించింది. అయితే రేపటి నుంచి మళ్లీ చలి పంజా విసరనుందని అధికారులు చెబుతున్నారు. JAN 5- 12 వరకు 2వ Coldwave 2.0 ఉంటుందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ సీజన్‌ ​డిసెంబర్‌లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలే మళ్లీ నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలపారు. ​పగటిపూటే 25-26°Cకి పడిపోతాయని అంచానా వేశారు. ఈ వారం రోజులు నగరవాసులు జాగ్రత మరి.

News January 5, 2026

సిద్దిపేట: తీవ్ర విషాదం.. యువ డాక్టర్ సూసైడ్

image

సిద్దిపేట పట్టణంలో ఆత్మహత్యాయత్నం చేసిన యువ డాక్టర్ చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాలు సిద్దిపేట మెడికల్ కళాశాల అనుబంధ ఆసుపత్రిలో ఇంటర్న్ షిప్ చేస్తున్న డాక్టర్ లావణ్య శనివారం గడ్డి మందును తన శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకుంది. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం HYDకు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.