News July 6, 2025
NGKL: జిల్లాలో రేపు మంత్రి పొంగులేటి పర్యటన- కలెక్టర్

నాగర్‌కర్నూల్ జిల్లాలో రేపు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదివారం తెలిపారు. ఉదయం 10:30కు మన్ననూర్ గృహవాని గెస్ట్ హౌస్‌కు చేరుకొని అక్కడే రెవెన్యూకు సంబంధించిన అంశాలపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం అమ్రాబాద్ పీడబ్ల్యూ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
Similar News
News July 6, 2025
బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగితే..

కొందరు బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగేందుకు ఇష్టపడతారు. అలా చేస్తే తొందరగా జీర్ణం అవుతుందని అపోహపడతారు. అయితే ఆ అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కూల్ డ్రింక్స్ వల్ల జరిగే కార్బొనేషన్ జీర్ణప్రక్రియను దెబ్బతీస్తుందని తెలిపారు. అధిక మొత్తంలో ఉండే చక్కెరతో బరువు పెరుగుతారని చెప్పారు. కూల్ డ్రింక్స్ బదులు మజ్జిగ తీసుకుంటే మేలని సూచిస్తున్నారు.
News July 6, 2025
విశాఖలో భక్తి శ్రద్ధలతో మొహరం

విశాఖలో మొహరం వేడుకలకు ఆదివారం సాయంత్రం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చెంగలరావుపేటలోని హుసేని మసీదు ఆధ్వర్యంలో షియా ముస్లింలు హజరత్ ఇమామ్ హుస్సేన్ మరణానికి సానుభూతిగా రక్తం చిందించారు. ఈ కార్యక్రమంలో షియా ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
News July 6, 2025
BJP, TDP, కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు: BRS

TG: ప్రజాభవన్ వేదికగా గురుశిష్యులు భేటీ అయి ఏడాదైనా ఆస్తులు-అప్పుల సమస్యలు తీరలేదని BRS ఆరోపించింది. వీరిద్దరి ఫెవికాల్ బంధం తెలంగాణ రైతుల గొంతు కోస్తోందని మండిపడింది. ‘వీరిద్దరి కుట్రలను తెలంగాణ సమాజం ఎప్పుడో పసిగట్టింది. గోదావరి జలాలను పక్క రాష్ట్రానికి దోచిపెడుతున్న రేవంత్‌ను ప్రజలు క్షమించరు. BJP, TDP, కాంగ్రెస్ మూకుమ్మడి కుట్రలకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు’ అని ఎక్స్‌లో ట్వీట్ చేసింది.