News January 11, 2026

NGKL జిల్లాలో 1,008 టన్నుల యూరియా నిల్వలు: కలెక్టర్

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రస్తుతం 1,008 టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెలకు గాను జిల్లాకు 6,619 టన్నుల యూరియా కేటాయించబడిందని, జడ్చర్ల, గద్వాల పాయింట్ల ద్వారా ఇది సరఫరా అవుతుందని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 300 ఎరువుల దుకాణాల ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్నట్లు ఆయన వివరించారు.

Similar News

News February 19, 2026

వసతి గృహాల్లో అంటు వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్

image

సంక్షేమ వసతి గృహాల్లో అంటువ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్‌లో అంతర్ శాఖల ఉమ్మడి తనిఖీ కమిటీ సమావేశం జరిగింది. అంటువ్యాధుల ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. వసతి గృహాలను నిరంతరం తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డా. యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

News February 19, 2026

తిరుపతి: రైతులకు ఇక మరింత సులభంగా.!

image

రైతులు పండించే పంటలను రైతే ఫోన్ ద్వారా e-crop నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. APAIMS యాప్ ద్వారా ఆధార్ నంబర్, MPINతో లాగిన్ చేసుకోవాలి. వారి భూమికి సంబంధించిన ఫొటోలను జియో కోఆర్డినేట్స్ ద్వారా అప్‌లోడ్ చేయాలి. ఇలా ఫోన్‌లో చేసిన వాటిని సంబంధిత అధికారులు ధృవీకరిస్తారు. జిల్లాలో 14వేల మంది రైతులు ఫోన్‌లోనే ఈ-క్రాప్ నమోదు చేసుకున్నారు.

News February 19, 2026

HYD: EAPCETకి 3,385 అప్లికేషన్స్

image

TG EAPCET ప్రవేశ పరీక్షకు సంబంధించి ఈ రోజు నుంచి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాలకు సంబంధించి 1,430 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇంజినీరింగ్ విభాగానికి 1,950 మంది అప్లై చేయగా 2 విభాగాలకు 5 మంది దరఖాస్తు చేసుకోవడంతో 3,385 అప్లికేషన్ వచ్చాయని TG EAPCET కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి JNTUHలో వెల్లడించారు.