News March 28, 2025
NGKL జిల్లాలో 28 మంది విద్యార్థులు గైర్హాజరు: డీఈవో

జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో 28 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోనీ పరీక్ష కేంద్రాలను తనిఖీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 60 కేంద్రాల్లో 10,584 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 10,556 విద్యార్థులు మాత్రమే హాజరయ్యారని అని పేర్కొన్నారు. 10వ తరగతి పరీక్షలను పక్కాగా నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు.
Similar News
News February 1, 2026
అట్టహాసంగా అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్

అనంతపురంలోని రాంనగర్‌లో 8వ అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు కార్యక్రమాన్ని ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమంలో డీఆర్ఓ రామకృష్ణారెడ్డి, ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంత ఫిలిం సొసైటీ అధ్యక్షుడు రషీద్ బాషా మాట్లాడుతూ.. లఘు చిత్రాల ప్రదర్శనల పోటీకి దేశవ్యాప్తంగా 142 లఘు చిత్రాలకు గాను 24 విభిన్న కేటగిరీలలో ప్రతిభావంతులకు అవార్డులను అందజేస్తామన్నారు.
News February 1, 2026
కావలి: రైలు కిందపడి వ్యక్తి సూసైడ్

కావలి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉదయగిరి బ్రిడ్జి కింద రైలు కిందపడి వ్యక్తి మృతి చెందాడని రైల్వే పోలీసులు తెలిపారు. ఆదివారం తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి జలదంకి మండలం అన్నవరం గ్రామానికి చెందిన కలిచేటి మాధవ (52) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై రైల్వే ఎస్సై వెంకట్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 1, 2026
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ప్రాధాన్యం: కిషన్ రెడ్డి

TG: కేంద్ర బడ్జెట్‌లో ఎరువులకు రాయితీ పెరిగిందని, దీనివల్ల రాష్ట్ర రైతులు లబ్ధి పొందుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ‘కాకతీయ టెక్స్‌టైల్స్ పార్క్‌కు మేలు చేసే పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. మెట్రో విస్తరణపై DPR ఇస్తే పట్టణాభివృద్ధి శాఖ నిధులు ఇస్తుంది. రాష్ట్రానికి 33 బాలికల హాస్టళ్లు, 3 హైస్పీడ్ రైళ్లు రానున్నాయి. డేటా సెంటర్లకు ఇచ్చే ప్రోత్సాహంతో TGకి లాభం ఉంటుంది’ అని పేర్కొన్నారు.


