News March 26, 2025

NGKL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం, ఏసీలు దగ్ధం

image

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని పలు ఏసీలు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. దీంతో సుమారు రెండు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆర్పి వేసినట్లు జిల్లా ఫైర్ అధికారి కృష్ణమూర్తి తెలిపారు.

Similar News

News March 28, 2025

కలెక్టర్: ‘పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు సలహాలు అందించాలి’

image

పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు సలహాలు, సూచనలు అందించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఓటర్ జాబితా సవరణపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ కుమార్‌ఝ వీడియో సమావేశంలో పాల్గొన్నారు.

News March 28, 2025

బాబోయ్ ఎండలు.. రేపు 223 మండలాల్లో వడగాలులు

image

AP: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇవాళ 181 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు APSDMA వెల్లడించింది. కమలాపురం, తాటిచెర్లలో 42.6, ఆలమూరులో 42.5, వెంకటగిరిలో 42.2, రావికమతంలో 42.1, వతలూరులో 42 డిగ్రీలు నమోదయ్యాయని తెలిపింది. రేపు 35 మండలాల్లో తీవ్ర వడగాలులు, 223 మండలాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం <>ఇక్కడ క్లిక్<<>> చేయండి.

News March 28, 2025

నాగోల్: స్కైవాక్ నిర్మాణాలపై సంస్థల ఆసక్తి..!

image

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం కొన్ని సంస్థలు స్థానిక నాగోల్, ఉప్పల్ స్టేడియం, దుర్గం చెరువు, కూకట్పల్లి తదితర మెట్రో స్టేషన్ల నుంచి స్కైవాక్ నిర్మించేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు L&T తెలిపింది. మెట్రో నుంచి స్కై వాక్ నిర్మాణాలకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా సంప్రదింపులు జరుగుతున్నాయి.

error: Content is protected !!