News April 15, 2025

NGKL జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ సదరమ్ క్యాంపు

image

నాగర్ కర్నూలు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యాలయంలో రెన్యువల్ సదరం సర్టిఫికెట్ల కోసం సంబంధిత దివ్యాంగులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఆర్డీఏ కార్యాలయం రూమ్ నంబర్ ఎఫ్1లో స్లాట్ పొందాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి చిన్న ఓబులేశ్ తెలిపారు. ఈనెల 23 నుంచి 28 వరకు శారీరక దివ్యాంగుల క్యాంపు నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తారని తెలిపారు.

Similar News

News January 8, 2026

విద్యార్థులకు సైబర్ నేరాలు, భద్రతపై అవగాహన

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో సైబర్ నేరాలు, రహదారి భద్రత, మహిళా రక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. శక్తి యాప్, శక్తి వాట్సాప్ నంబర్ 7993485111, డయల్ 100 వంటి సేవలపై శక్తి టీంలు అవగాహన కల్పిస్తున్నాయి. ప్రతి విద్యార్థి హెల్మెట్ వాడకం, సైబర్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మహిళల రక్షణకు పోలీసులు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు.

News January 8, 2026

ED రైడ్స్.. IPAC ఆఫీసుకు మమత పరుగులు

image

<<18796717>>ED రైడ్స్‌<<>>తో WBలో రాజకీయ వేడి రాజుకుంది. తనిఖీలు జరుగుతున్న కోల్‌కతా సాల్ట్‌లేక్‌లోని IPAC ఆఫీసుకు CM మమత చేరుకున్నారు. బిల్డింగ్ ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు క్లోజ్ చేసి ఉండడంతో బేస్‌మెంట్‌లోని లిఫ్ట్‌లో 11వ ఫ్లోర్‌లోని IPAC ఆఫీసులోకి వెళ్లారు. ఆమె, పోలీసులు కలిసి ED రైడ్స్‌ను అడ్డుకున్నారని BJP ఆరోపించింది. దీదీ చర్యలను BJP నాయకులు ఖండిస్తున్నారు. కీలక డాక్యుమెంట్లను తీసుకెళ్లారని వార్తలు వస్తున్నాయి.

News January 8, 2026

అందోల్: ఆరోగ్యశ్రీ ఉద్యోగి సూసైడ్

image

అందోల్‌ మండలం సంగుపేట గ్రామంలో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో కమ్మరి రవీందర్(39) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. రవీందర్ 12 ఏళ్లుగా ఆరోగ్యశ్రీ సంస్థలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రవీందర్ మరణంతో భార్య, కుమారుడు అనాథలయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.