News April 22, 2025
NGKL: జైలుకు గ్యాంగ్ రేప్ నిందితులు

ఊరుకొండపేట ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో వివాహితపై గ్యాంగ్ రేప్ చేసిన ఏడుగురు నిందితుల పోలీస్ కస్టడీ సోమవారంతో ముగిసింది. కల్వకుర్తి డిఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏడుగురిని కస్టడీ తీసుకొని సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. నిందితులు దేవాలయం సమీపంలో గతంలో ఏమైనా నేరాలకు పాల్పడ్డారా అనే కోణంలో విచారణ జరిగినట్లు సమాచారం. కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం జైలుకు తరలించారు.
Similar News
News April 22, 2025
నిర్మల్: ‘అమ్మానాన్న కష్టం చూడలేక ఆర్మీ జాబ్ కొట్టాడు’

బైంసా మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సాకేత్ మొదటి ప్రయత్నంలోనే ఆర్మీ ఫలితాల్లో ఉద్యోగం సాధించాడు. తల్లిదండ్రులు వ్యవసాయం, కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. తన అమ్మానాన్నల కష్టాన్ని చూసి ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే కృషితో పట్టుదలతో మొదటి ప్రయత్నంలోనే ఆర్మీ ఉద్యోగం సాధించాడు. కానిస్టేబుల్ కృష్ణ చౌహాన్‌ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఉద్యోగం పొందానని తెలిపాడు. అతడినిని పలువురు అభినందించారు.
News April 22, 2025
కంది: రిసోర్స్ పర్సన్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాల స్థాయిలో మండల, జిల్లా స్థాయిలో రిసోర్స్ పర్సన్స్ గా పనిచేయడానికి ఆసక్తిగల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, LFL HMs, ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. నిర్ణీత నమూనాలో ఆసక్తిగల ఉపాధ్యాయులు ఈ నెల 24వ తేదీ లోపు జిల్లా విద్యాశాఖ అధికారికి తమ దరఖాస్తులను సమర్పించాలని తెలిపారు.
News April 22, 2025
మెదక్: రిసోర్స్ పర్సన్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

జిల్లా, మండల స్థాయి రిసోర్స్ పర్సన్ల కోసం దరఖాస్తులు ఈనెల 24 వరకు స్వీకరిస్తున్నట్లు మెదక్ డీఈఓ రాధా కిషన్ తెలిపారు. రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ వారి ఆదేశానుసారం 2025-26 విద్యా సంవత్సరంలో వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సబ్జెక్ట్ రిసోర్స్ పర్సన్‌లుగా వ్యవహరించేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ నిర్వహించి 28న ప్రకటిస్తారన్నారు.