News December 12, 2025
NGKL: టీబీ నిర్మూలనకు మొబైల్ ఎక్స్‌రే యూనిట్ ప్రారంభం

జిల్లాలో టీబీ నిర్మూలన కోసం ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం కింద శుక్రవారం మొబైల్ ఎక్స్‌రే యూనిట్‌ను అధికారులు ప్రారంభించారు. రూ.22 లక్షల విలువైన ఈ ఆధునిక యంత్రాన్ని డాక్టర్ రఫిక్, డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీ ఘన, ఇంజినీర్ సచిన్ పరిచయం చేశారు. గ్రామాల వారీగా నిర్వహించే టీబీ గుర్తింపు శిబిరాలకు ఈ మొబైల్ ఎక్స్‌రే యూనిట్‌ను తీసుకెళ్లి అనుమానితులందరికీ పరీక్షలు చేయనున్నారు.
Similar News
News December 13, 2025
PPM: వాళ్లందరికీ స్మార్ట్ ఫోన్లు అందజేత

పార్వతీపురం జిల్లాలోని అంగన్వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లు, బీపీసీలకు కూటమి 5జీ మొబైల్స్‌ను అందించనుంది. ఈ సెల్ ఫోన్స్‌ను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నేడు అందజేయనున్నారు. జిల్లాలో 2,075 మంది అంగన్వాడీలు, 84 మంది సూపర్‌వైజర్లు, పది మంది బీపీసీలు ఉన్నారు. విధుల్లోని ఆన్‌లైన్ పనులకు ఆటంకం కలగకుండా ఈ కొత్త ఫోన్లను అందజేస్తున్నారు.
News December 13, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<
News December 13, 2025
NZB: మద్యం దుకాణాలు బంద్

2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మద్యం దుకాణాలను మూసి వేయనున్నామని NZB జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి శుక్రవారం తెలిపారు. 14వ తేదీ ఎన్నికల కౌంటింగ్ ముగిసే వరకు నిజామాబాద్ రూరల్, ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, సిరికొండ, జక్రాన్పల్లి మండలాల పరిధిలో మద్యం దుకాణాలు మూసి ఉంచనున్నట్లు తెలిపారు.


