News October 13, 2025
NGKL: డీసీసీ అధ్యక్ష పదవికి కొండ మణెమ్మ దరఖాస్తు

నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం మాజీ జడ్పీటీసీ కొండ మణెమ్మ ఆదివారం దరఖాస్తు చేసుకున్నారు. పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణ స్వామికి దరఖాస్తు పత్రాలను అందజేశారు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ సీనియర్ నాయకులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. అధ్యక్ష పదవి చివరికి ఎవరికి దక్కుతుందో చూడాలి.
Similar News
News October 13, 2025
క్రాప: ‘చదువుకున్న స్కూలుకే టీచర్’

అయినవిల్లిలోని క్రాపకు చెందిన చిక్కం లక్ష్మి ఇటీవల జరిగిన ఏపీ డీఎస్సీ – 2025 పరీక్షలో స్కూల్ అసిస్టెంట్ హిందీ విభాగంలో జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. అంతే కాకుండా తాను చదువుకున్న కె.జగన్నాథపురం జెడ్పీ హైస్కూల్‌లోనే పోస్టింగ్ దక్కించుకోవడం విశేషం. తాను చదువుకున్న క్లాస్ రూమ్‌లోనే విద్యార్థాలకు పాఠాలు చెప్పనుంది. లక్ష్మికి ఉపాధ్యాయులు, కుటుంబసభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
News October 13, 2025
కడప: కుటుంబం ఆత్మహత్య

కడప జిల్లాలో ఆదివారం రాత్రి విషాదం నెలకొంది. రాయచోటి రహదారి ఫ్లైఓవర్ సమీపంలో కడప నగరంలోని శంకరాపురానికి చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎర్రగుంట రైల్వే ఎస్సై సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. వారి మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. మరో కొద్ది దూరంలో కడప నబీ కోటకు చెందిన శివ అనే వ్యక్తి మృతదేహం కూడా కనిపించినట్లు పేర్కొన్నారు. ఈ మృతదేహాలను కడప రిమ్స్‌కు తరలించారు.
News October 13, 2025
నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా?

ఉదయం నిద్ర లేవగానే అలసటగా అనిపించడం పలు ఆరోగ్య సమస్యలకు సంకేతమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అది షుగర్ వ్యాధికి సంకేతమని చెబుతున్నారు. రక్తంలో షుగర్ స్థాయి పెరిగినప్పుడు ఎనర్జీ లెవల్స్ తారుమారవుతాయి. దాంతో లేవగానే అలసట, గొంతు ఎండిపోవడం, కంటిచూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు. క్రమంగా అలాంటి లక్షణాలే కనిపిస్తుంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.