News April 11, 2025
NGKL: ‘తెలంగాణ.. టూరిజానికి టర్నింగ్ పాయింట్’

తెలంగాణలో పీపీపీ విధానంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ముంబయిలో జరిగిన హోటల్స్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పెట్టుబడిదారులకు రాయితీలు, పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. 2030 నాటికి రూ.15 వేల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగాల లక్ష్యంగా తెలంగాణను టాప్-5 పర్యాటక రాష్ట్రాల్లో నిలపాలని తెలిపారు.
Similar News
News April 18, 2025
అతడి ప్రశాంతత వల్ల మాపై ఒత్తిడి తగ్గింది: భువనేశ్వర్

RCB కెప్టెన్ రజత్ పాటీదార్ నాయకత్వ బాధ్యతల్ని అద్భుతంగా నిర్వర్తిస్తున్నారని ఆ జట్టు బౌలర్ భువనేశ్వర్ కొనియాడారు. ‘రజత్ చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఈ ఫార్మాట్‌లో అలా ఉండటం చాలా కీలకం. కొంతమంది ఒక మ్యాచ్ కోల్పోగానే టెన్షన్ పడిపోతారు. కానీ రజత్ జయాపజయాల్ని సమానంగా తీసుకుంటాడు. ఓడినప్పుడు ఎలా ఉన్నాడో, గెలిచినప్పుడూ అలాగే ఉన్నాడు. అతడి ప్రశాంతత కారణంగా మాపై ఒత్తిడి తగ్గింది’ అని తెలిపారు.
News April 18, 2025
న్యాయవాదుల అభిమానం మరువలేనిది: జిల్లా ప్రధాన న్యాయమూర్తి

మెదక్ జిల్లా న్యాయవాదుల అభిమానం మరువలేనిదని మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మి శారద అన్నారు. సూర్యాపేటకు బదిలీ అయిన సందర్భంగా మెదక్ కోర్టులో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సన్మానం ఏర్పాటు చేశారు. ఇక్కడ సేవలందించడం గొప్పవరం అన్నారు. ప్రతి న్యాయవాది పేద ప్రజలకు అండగా నిలబడాలన్నారు. మెదక్ జిల్లా న్యాయవాదుల అభిమానం వెలకట్టలేనిదని, ఇక్కడి ప్రజల అభిమానం మరువలేనిదని ఆమె పేర్కొన్నారు.
News April 18, 2025
పార్వతీపురం: ‘స్వర్ణ ఆంధ్రా-స్వచ్ఛ ఆంధ్రాను విజయవంతం చేయాలి’

శనివారం నిర్వహించే స్వర్ణ ఆంధ్రా-స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ శుక్రవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో స్వర్ణ ఆంధ్రా-స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమం జరగాలన్నారు. ‘ఇ వేస్ట్ మేనేజ్మెంట్’ శీర్షికన ఈ నెల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.