News March 30, 2025
NGKL: దిగుబడి రాలేదని కౌలు రైతు ఆత్మహత్య

మామిడి పంట దిగుబడి రాకపోవడంతో మనస్తాపం చెంది కౌలు రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దేవల్ తిరుమలాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోనమోని శ్రీనివాసులు అనే రైతు కల్వకుర్తి మండలం వేపూరు గ్రామంలో మామిడి తోటను కౌలు చేస్తున్నాడు. దిగుబడి రాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
Similar News
News November 10, 2025
రేపే సీఎం రాక.. బందోబస్తు వివరాలు వెల్లడించిన ఎస్పీ!

రేపు పీసీపల్లి మండలంలో సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాటుచేసిన బందోబస్తు వివరాలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం తెలిపారు. ఇద్దరు ఏఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, 20 మంది సీఐలు, 49 మంది ఎస్‌ఐలతో పాటు మొత్తం 800 మంది పోలీసులు, హోం గార్డులు, ఇతర భద్రతా సిబ్బందిని బందోబస్తు విధుల్లో నియమించినట్లు చెప్పారు. ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా 6 ప్రత్యేక మొబైల్ బైక్ పెట్రోలింగ్ టీమ్‌లను కూడా ఏర్పాటు చేశామన్నారు.
News November 10, 2025
మక్తల్‌లో జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలు ప్రారంభం

మక్తల్ మినీ స్టేడియం మైదానంలో సోమవారం ఎస్‌జీఎఫ్ జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలను జిల్లా క్రీడల శాఖ అధికారి (డీవైఎస్‌ఓ) వెంకటేష్ ప్రారంభించారు. 14 నుంచి 17 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఈ క్రీడలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, విజేతలను ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎంపిక చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
News November 10, 2025
NRPT: ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

నారాయణపేట కలెక్టరేట్ ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం జరిగిన కార్యక్రమానికి 27 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ, వాటిని సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత్ గంగ్వార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు.


