News March 30, 2025

NGKL: నేడు, రేపు పనిచేయనున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు

image

ఆది, సోమవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. LRS ఫీజు మార్చి31లోపు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ వర్తిస్తుందని రిజిస్ట్రేషన్ శాఖ తొలుత ప్రకటించింది. అయితే 30, 31 సెలవుదినాలు కావడంతో చెల్లింపులు జరపలేకపోతున్నామని ప్రజల నుంచి విజ్ఞప్తులు రావడంతో సెలవులు రద్దు చేసినట్లు తెలిపారు.

Similar News

News November 10, 2025

‘సాంస్కృతిక పునరుజ్జీవనంలో ఆయన పాత్ర సదా స్మరణీయం’

image

ప్రముఖ కవి,అందెశ్రీ అకాల మరణం పట్ల తెలంగాణ జాగృతి చీఫ్ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిధ్వనింపజేసిన అద్భుత గీతం అందెశ్రీ కలం నుంచే వచ్చిందని కొనియాడారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలోనూ, సాంస్కృతిక పునరుజ్జీవన పోరాటంలోనూ ఆయన పోషించిన పాత్ర సదా స్మరణీయం అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

News November 10, 2025

బురుజుపేటలో పాత సంప్రదాయాలే పాటించాలి..

image

బురుజుపేట కనకమహాలక్ష్మి ఆలయంలో EO శోభారాణి నిర్ణయాలపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆలయ సంప్రదాయ పద్ధతులు మార్చడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో భక్తులకు స్వేచ్ఛగా అభిషేకాలు, పూజలు చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు జల్లెడ పెడుతున్నారని, రాత్రిళ్లు గేట్లు మూసేస్తున్నారని ఆరోపించారు. ఈ విషమం MLA వంశీకృష్ణ దృష్టికి భక్తులు తీసుకెళ్లాగా పాత పద్ధతిలనే కొనసాగించాలని EOను అదేశించారు.

News November 10, 2025

మొంథా తుఫాన్.. 1,64,505 హెక్టార్లలో పంట నష్టం

image

AP: మొంథా తుఫాన్ వల్ల రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 1,64,505 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 31వేల హెక్టార్లలో, కోనసీమలో 29,537, కాకినాడలో 21,422 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. తుఫాన్ ప్రభావిత 6 జిల్లాల్లో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పౌసుమీ బసు నేతృత్వంలోని 8 మంది సభ్యుల బృందం.. ఇవాళ, రేపు పర్యటించి పంట నష్టంపై కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.