News February 23, 2025
NGKL: నేడే గురుకుల విద్యాలయాలకు ప్రవేశ పరీక్ష

గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతుల్లో ప్రవేశాలకు నేడు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 62 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసినట్లు వారు చెప్పారు. హాల్‌టికెట్లతో పాటు బ్లాక్, బ్లూ పెన్నులు, ఆధార్‌కార్డు, పాస్‌ఫొటోలతో రావాలని సూచించారు. ఉ. 11 గం. నుంచి మ.1 గంట వరకు జరిగే పరీక్షకు ఉ.9 గం.లకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News February 24, 2026
ఉల్లిలో ఆకుమచ్చ, పచ్చ పురుగు, కుళ్లు తెగులు నివారణ

ఉల్లిలో ఆకుమచ్చ తెగులు వల్ల ఆకులపై ఊదారంగు మచ్చలు ఏర్పడి ఎండిపోతాయి. దీని నివారణకు కార్బండిజం, మాంకోజెబ్ 2 గ్రాముల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఉల్లిలో ఆకు తినే పచ్చ పురుగు నివారణకు లీటర్ నీటికి కార్బరిల్ 3 గ్రాములు (లేదా) ప్రొపినోఫాస్ 2 mlను కలిపి పిచికారీ చేయాలి. ఇక కుళ్లు తెగులు నివారణకు మెటలాక్సిల్ + మాంకోజెబ్ 3 గ్రాములను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
News February 24, 2026
థాయ్‌లాండ్‌లో కొత్త వైరస్.. జూపార్క్‌లో ‘బయో- బబుల్’

‘థాయ్‌లాండ్ మరణాలు ఒక హెచ్చరిక.. గాలి ద్వారా వైరస్ సోకకుండా అడ్డుకోవం మా లక్ష్యం’ అని నెహ్రూ జూపార్క్ సిబ్బంది తెలిపారు. శానిటైజేషన్‌కే పరిమితం కాకుండా, వన్యప్రాణుల మధ్య ‘సోషల్ డిస్టెన్సింగ్’ ఎన్‌క్లోజర్ల పర్యవేక్షణను పెంచారు. వైరస్ మ్యుటేషన్ చెందకుండా సోడియం హైపో క్లోరైడ్, జంతువుల ఆహారంలో రోగనిరోధక శక్తిని పెంచే సప్లిమెంట్లను ఇస్తున్నారు. మూగజీవాల ప్రాణాలను కాపాడేందుకు యుద్ధం అని వివరించారు.
News February 24, 2026
పార్వతీపురం: ‘డోలి రహిత రోడ్ల నిర్మాణంలో నాణ్యత, పారదర్శకత పాటించాలి’

జిల్లాలో చేపట్టిన డోలి రహిత రోడ్ల నిర్మాణంలో నాణ్యత, పారదర్శకతతో పనులను పూర్తిచేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మొత్తం మంజూరు చేసిన 81 డోలి రోడ్ల పనులు కూడా జరగాలని, ప్రారంభం కాని రోడ్లు ఉంటే వెంటనే ప్రారంభించాలన్నారు. ఇప్పటివరకు 50 రోడ్ల పనులు గ్రౌండింగ్ అయ్యాయని, మిగిలిన పనులన్నీ ప్రారంభం కావాలన్నారు.


