News November 22, 2025
NGKL: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధత..!

గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిల్లా అధికారులు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ప్రకటించిన రిజర్వేషన్లు పక్కనపెట్టి కొత్తగా గ్రామాల వారిగా రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈనెల 26 లేదంటే 27న ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది..? నాగర్ కర్నూల్ జిల్లాలో 460 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.
Similar News
News November 23, 2025
WGL: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు.. ఉత్కంఠ

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం శనివారం రిజర్వేషన్లపై జీవో విడుదల చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50% లోపే ఉండేలా నిర్ణయించింది. వార్డు సభ్యుల SC, ST, BC రిజర్వేషన్లు తాజా కులగణన ఆధారంగా, సర్పంచ్ పదవుల్లో బీసీ రిజర్వేషన్ కులగణన ప్రకారం, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు 2011 జనాభా లెక్కల ప్రకారం అమలు కానున్నాయి. మహిళా రిజర్వేషన్లకు లాటరీ విధానం పాటించనుంది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉత్కంఠ నెలకొంది.
News November 23, 2025
అల్పపీడనం.. అతి భారీ వర్షాలు

AP: ద.అండమాన్ సముద్ర పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడిందని IMD వెల్లడించింది. ఇది రేపటికి వాయుగుండంగా, ఈనెల 30 నాటికి తుఫానుగా మారుతుందని అంచనా వేసింది. ఉత్తర కోస్తాకు తుఫాను ముప్పు పొంచి ఉందని, NOV 28 నుంచి వర్షాలు పెరుగుతాయని తెలిపింది. అలాగే ఉత్తరాంధ్రలో భారీ-అతిభారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఇవాళ ప్రకాశం, నెల్లూరు, KDP, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA ప్రకటించింది.
News November 23, 2025
ఆశపడి వెల్లుల్లితిన్నా రోగం అట్లాగే ఉందట

వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదని, కొన్ని రోగాలను నయం చేస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఆ ఘాటును భరించి తిన్నా ఎలాంటి మార్పు లేకపోతే నిరాశే ఎదురవుతుంది. అలాగే ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఎంతో ప్రయాసపడి, కష్టపడి ప్రయత్నించినప్పటికీ, చివరికి ఫలితం శూన్యమైనప్పుడు లేదా పరిస్థితిలో పురోగతి లేనప్పుడు ఈ సామెతను సందర్భోచితంగా వాడతారు.


