News April 6, 2025

NGKL: పండగను శాంతియుతంగా చేసుకోవాలి: కలెక్టర్

image

నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శ్రీరామ నవమి సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజలందరిపై భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు శాంతియుతంగా ఆనందోత్సవాల మధ్య పండగను చేసుకోవాలన్నారు. ప్రకృతిని రక్షించాలని అప్పుడే మనం రాబోయే తరాలకు బంగారు భవిష్యత్తును అందించిన వారమవుతామని తెలిపారు.

Similar News

News April 7, 2025

అబుదాబిలో ఘనంగా రామనవమి వేడుకలు

image

అబుదాబీలోని బాప్స్ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. నవమి వేడుకలతో పాటు స్వామి నారాయణ జయంతి సందర్బాన్ని ఆలయ నిర్వాహకులు అద్భుతంగా జరిపించారు. యూఏఈ వ్యాప్తంగా ఉన్న భక్తులు వందలాదిగా కార్యక్రమానికి తరలివచ్చారని వారు తెలిపారు. రామ భజనలతో జన్మోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నామని, హైందవ విలువలకు, శాంతి-ఐక్యతకు కార్యక్రమం ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు.

News April 7, 2025

‘ఇండియన్ ఐడల్’ విజేత మానసి ఘోష్.. ప్రైజ్ మనీ ఎంతంటే..

image

‘ఇండియన్ ఐడల్’ 15వ సీజన్లో బెంగాల్‌కు చెందిన మానసి ఘోష్ విజేతగా నిలిచారు. ట్రోఫీతో పాటు ఆమె సరికొత్త కారును, రూ.25 లక్షల ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. ఫినాలేలో ఆమె శుభజిత్ చక్రవర్తి, స్నేహా శంకర్‌తో పోటీ పడ్డారు. శుభజిత్ రన్నరప్‌గా, స్నేహ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. కాగా స్నేహకు ఫినాలేకు ముందుగానే టీ-సిరీస్ అధినేత రికార్డింగ్ కాంట్రాక్ట్ ఇవ్వడం విశేషం.

News April 7, 2025

సింహపురి ప్రీమియం లీగ్ ప్రారంభం

image

నెల్లూరు సమీపంలోని బుజబుజ నెల్లూరు సీఐఏ క్రికెట్ అకాడమీలో సింహపురి ప్రీమియర్ లీగ్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఛైర్మన్ పి.విజయ్‌కుమార్, మదీనా ఇంతియాజ్ తదితరులు హాజరయ్యారు. రాయల్ ఛాలెంజర్స్ గూడూరు జట్టు 19.2 ఓవర్లలో 10 వికెట్లకు 139 పరుగులు సాధించింది. ఆత్మకూర్ రేంజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 112 పరుగులు సాధించి ఓడిపోయింది.

error: Content is protected !!