News July 5, 2024

NGKL: పిల్లలు పుట్టడం లేదని మహిళ సూసైడ్

image

పిల్లలు కావడంలేదని ఓ వివాహిత సూసైడ్ చేసుకున్న ఘటన NGKL జిల్లాలో జరిగింది. చారకొండ మండలం శిర్సనగండ్లకు చెందిన రాజశ్రీ(29)కి APలోని కంభంపాడుకు చెందిన శేషుతో 2014లో పెళ్లైంది. పిల్లలు కాకపోవడంతో దంపతులు తరచూ గొడవ పడేవారు. ఆమె 3నెలలుగా పుట్టింట్లోనే ఉంటుంది. బుధవారం భర్తకు ఫోన్‌ చేసి పురుగు మందు తాగింది. కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ రాత్రి చనిపోయంది. ఘటనపై నిన్న కేసు నమోదైంది.

Similar News

News December 11, 2025

MBNR: 11 గంటల వరకు 56.63%.. మరికొద్ది నిమిషాలే టైం..!

image

మహబూబ్‌నగర్ జిల్లాలోని స్థానిక సంస్థల మొదటి దశ ఎన్నికల సందర్భంగా ఉదయం 11 గంటల సమయానికి 56.63% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్ సమయం ముగిసేందుకు మరికొద్ది సేపు మాత్రమే ఉండటంతో ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రానికి తరలివస్తున్నారు. ప్రజలు తప్పనిసరిగా బాధ్యతాయుతంగా వ్యవహరించి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

News December 11, 2025

మహబూబ్‌నగర్: పోలింగ్ కేంద్రాల వద్ద వైద్య సేవలు

image

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా మొదటి దేశ పోలింగ్ సందర్భంగా 139 గ్రామపంచాయతీలలో పోలికొనసాగుతోంది. ఆయా గ్రామపంచాయతీలలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలను ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన వారు ఎవరైనా అనారోగ్యానికి గురైనట్లయితే వెంటనే వారికి అక్కడే వైద్యం అందు విధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే వారికి అక్కడికక్కడే అందించేందుకు అన్ని రకాల టాబ్లెట్లను సిద్ధంగా ఉంచారు.

News December 11, 2025

మహబూబ్‌నగర్ జిల్లాలో 22.55% ఓటింగ్

image

మహబూబ్‌నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల సమయానికి 22.55% పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో పోలింగ్ మందకోడిగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఉదయం 8 గంటల తర్వాత ఓటర్లు రాక మొదలైంది. పోలింగ్ కేంద్రానికి ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులను జాగ్రత్తగా కేంద్రంలోకి తీసుకెళ్లి ఓటు వేయిస్తున్నారు.