News March 26, 2025

NGKL: పెద్దకొత్తపల్లిలో 39.4 గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

image

నాగర్ కర్నూల్ జిల్లాలో 25 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాలలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా.. అత్యధికంగా పెద్దకొత్తపల్లిలో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అచ్చంపేట 39.0, కొల్లాపూర్ 38.9, తెలకపల్లి 38.8, బిజినపల్లి 38.6, పెంట్లవెల్లి 38.4, కోడేరు 38.3, నాగర్‌కర్నూల్ 38.2, కల్వకుర్తి 38.0, ఉప్పునుంతల 37.5, బల్మూర్ 37.3 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News September 17, 2025

జగిత్యాల: మహిళలు సంపూర్ణ ఆరోగ్యం సాధించాలి: ఎమ్మెల్యే

image

మహిళలు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకొని సంపూర్ణ ఆరోగ్యం సాధించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని మాతా శిశు కేంద్రంలో బుధవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం చేపట్టిన స్వస్థనారి స్వసక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోషక విలువలపై కూడిన ఆహారం తీసుకోవాలని మహిళలకు సూచించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.

News September 17, 2025

కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వం తక్షణ చర్యలు: కోదండ రెడ్డి

image

కుండపోత వర్షాల వల్ల నష్టం జరగకుండా కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టిందని రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి తెలిపారు. సహాయక బృందాలు చర్యలు చేపట్టి 1,251 మందిని కాపాడాయన్నారు. వరదల వల్ల నష్టపోయిన 1,737 నివాస గృహాలకు రూ.1.85 లక్షల చొప్పున నష్టపరిహారం మంజూరు చేసినట్లు వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయిన ఆరుగురి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామన్నారు.

News September 17, 2025

స్మృతి మంధాన సూపర్ సెంచరీ

image

AUSWతో జరుగుతున్న రెండో వన్డేలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన సెంచరీతో చెలరేగారు. 77బంతుల్లో 12ఫోర్లు, 4సిక్సర్లతో శతకం బాదారు. దీంతో IND తరఫున రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేశారు. తొలి ఫాస్టెస్ట్ సెంచరీ కూడా ఆమె పేరిటే ఉండటం విశేషం. గతంలో స్మృతి ఐర్లాండ్‌పై 70 బంతుల్లోనే శతకం నమోదు చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన IND టీమ్ 32 ఓవర్లలో 191/3 రన్స్ చేసింది. క్రీజులో స్మృతి, దీప్తి శర్మ(12) ఉన్నారు.