News December 10, 2025
NGKL: పొలింగ్, ఓట్ల లెక్కింపు సజావుగా జరగాలి: కలెక్టర్

తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ ప్రక్రియతో పాటు ఓట్ల లెక్కింపు సజావుగా కొనసాగాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కోరారు. రేపు ఉదయం 7 గంటలకు 137 గ్రామ పంచాయతీలలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి సిబ్బందితో పాటు అభ్యర్థులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల విధులకు 6000 మందికిపైగా సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.
Similar News
News December 12, 2025
కరీంనగర్: రెండో విడత ఎన్నికలకు రంగం సిద్ధం

మొదటి విడత ఎన్నికలు పూర్తయినందున, రెండో విడత ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. చిగురుమామిడి మండలంలోని 17, తిమ్మాపూర్‌లో 23, మానకొండూరులో 17, శంకరపట్నం 29, గన్నేరువరం మండలంలో 27 గ్రామపంచాయతీలకు గాను 1046 వార్డు సభ్యుల స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
News December 12, 2025
KNR: తాటి గేగులు.. ఆరోగ్య సిరులు!

ప్రకృతి మనకు అందించిన అద్భుతమైన ఆహారాల్లో ‘తాటి గేగులు’ ఒకటి. పల్లెటూర్లలో ఎక్కువగా దొరికే ఈ గేగులు ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు పట్టణాల్లోనూ అందుబాటులో ఉన్నాయి. కేవలం రుచికోసమే కాకుండా, వీటిని తినడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తాటి గేగులలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
News December 12, 2025
KNR: కొత్త సర్పంచులకు ‘ముళ్ల బాట’.. స్వాగతం పలుకుతున్న సమస్యలు

గ్రామ పంచాయతీ ఖాతాల్లో నిధులు నిండుకున్నాయి. ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా పంచాయతీల్లో పారిశుద్ధ్యం పడకేసింది. ట్రాక్టర్ల డీజిల్ బకాయిలు పేరుకుపోయాయి. దీంతో అధికారికంగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచే సర్పంచులు నిధుల వేటలో పడాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం నుంచి గ్రాంట్లను రాబట్టడం, పన్నులు వసూలు చేయడం, పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడం. ఇవన్నీ కొత్త సర్పంచులకు అగ్నిపరీక్షే అని చెప్పాలి.


