News August 25, 2025

NGKL: ప్రజావాణి దరఖాస్తులపై సత్వర చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులపై ఆయా శాఖల అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బధావత్ సంతోష్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 39 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలు తీరుతాయని ప్రజలు ఎంతో ఆశతో వచ్చి ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటున్నారని గుర్తు చేశారు.

Similar News

News August 26, 2025

గాజా ఆసుపత్రిపై దాడి.. ఐదుగురు జర్నలిస్టులు మృతి!

image

గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. తాజాగా ఓ ఆసుపత్రిపై చేసిన దాడిలో 20 మంది మరణించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. వీరిలో ఐదుగురు జర్నలిస్టులు ఉన్నారని తెలిపింది. రాయిటర్స్, అసోసియేటెడ్ ప్రెస్ వంటి సంస్థలతో కలిసి పనిచేసిన వారు ఉన్నారని వెల్లడించింది. మరోవైపు ఈ దాడులతో తాను సంతోషంగా లేనని యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి అని తుర్కియే దుయ్యబట్టింది.

News August 26, 2025

ఆ మ్యాచుల ఫలితం మార్చాలనుకుంటా: ద్రవిడ్

image

టీమ్ ఇండియా మాజీ ప్లేయర్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్‌లో మాజీ కోచ్ ద్రవిడ్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒకవేళ అవకాశం ఉంటే తాను ఆడిన ఓ 2 మ్యాచుల ఫలితాలు మార్చాలని ఉందన్నారు. టెస్టుల్లో 1997లో వెస్టిండీస్‌తో బార్బడోస్‌ టెస్ట్‌లో పరాజయం, 2003 ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి రిజల్ట్స్‌ను మార్చాలని కోరుకుంటానని అభిప్రాయపడ్డారు. ప్లేయర్‌గా ద్రవిడ్‌కు WC కలగానే మిగిలినా కోచ్‌గా 2024 టీ20 వరల్డ్ కప్ అందుకున్నారు.

News August 26, 2025

ఆగస్టు 26: చరిత్రలో ఈ రోజు

image

1910: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా జననం(ఫొటోలో)
1920: కవి, రచయిత, పాత్రికేయుడు ఏల్చూరి సుబ్రహ్మణ్యం జననం
1963: సినీ నటుడు సురేశ్ జననం
1982: దేశంలో తొలి ఓపెన్ యూనివర్సిటీ డా.బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో ప్రారంభం
* మహిళా సమానత్వ దినోత్సవం
* అంతర్జాతీయ కుక్కల దినోత్సవం