News December 6, 2025
NGKL: ప్రజాస్వామ్యం అంటే మోదీకి విలువలేదు: ఎంపీ

ప్రజాస్వామ్యం అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విలువలేదని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన సందర్భంగా లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ, మల్లికార్జున కార్గేను ఆహ్వానించకపోవడం ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ విలువలను పక్కనపెట్టి ఏకపక్షంగా ముందుకు సాగుతున్నారని మండిపడ్డారు.
Similar News
News December 6, 2025
అనకాపల్లి జిల్లా యువకుడి సూసైడ్..!

మాడుగుల(M) జమిదేవి పేటకు చెందిన బాలు(19)ని కుటుంబ సభ్యులు మందలించడంతో సూసైడ్ చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. బాలు గతేడాది ఇంటర్ పూర్తిచేసి ప్రస్తుతం ఊర్లో ఖాళీగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్థాపంతో గ్రామంలోని అతని అమ్మమ్మ ఇంటి మేడ పైన ఉరేసుకొని చనిపోయాడు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు శనివారం మాడుగుల ఎస్సై నారాయణరావు తెలిపారు.
News December 6, 2025
రాకెట్ వేగంతో దూసుకుపోతున్న భారత్ ‘ఫిన్‌టెక్’

స్కాన్.. పే.. డన్. ఈ భారత UPI చెల్లింపుల టెక్నాలజీ రాకెట్ వేగంతో గ్లోబల్ ఆధిపత్యం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఫ్రాన్స్, సింగపూర్, UAE, ఖతర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మారిషస్‌లో ఇది పనిచేస్తోంది. EAST ASIA సహా మరో 8 దేశాల్లో దీని అమలుకు చర్చిస్తున్నట్లు ఫైనాన్షియల్ SEC నాగరాజు తెలిపారు. వరల్డ్ వైడ్‌గా 20+కంట్రీలను UPI ఎనేబుల్డ్ చేయాలన్నది లక్ష్యం. UPI USERS 50CRకి చేరగా INDIAలో 49CR ఉన్నారు.
News December 6, 2025
ఎన్నికల ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: సూర్యాపేట కలెక్టర్

మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆర్డీవోలు, తహశీల్దార్లతో ఆయన వెబ్‌ఎక్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, మెటీరియల్ పంపిణీ, కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలించాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ వివరాలను 37ఏ, 37సీ రిజిస్టర్లలో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు.


