News March 13, 2025

NGKL: ప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువతి

image

నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామానికి చెందిన సల్వాది లక్ష్మయ్య, నర్సమ్మల కుమార్తె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం నియామక పత్రాన్ని అందజేశారు. పేద కుటుంబానికి చెందిన యువతి ఉద్యోగం సాధించడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News September 18, 2025

నిర్మల్: ‘మేదరులను ఎస్టీ జాబితాలో చేర్చాలి’

image

మేదరులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆ కుల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనరసయ్య అన్నారు. గురువారం పట్టణంలో ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మేదరులను ఆదుకునేందుకు మేదరి బంధు, ఇందిరమ్మ ఇళ్లు వెంటనే అందించాలని, జనాభా ప్రాతిపదికన ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ప్రకటించాలన్నారు. 55 సంవత్సరాలు నిండిన వారందరికీ పెన్షన్లను మంజూరు చేయాలని కోరారు.

News September 18, 2025

కొత్తగూడెం: ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని వినతి

image

జిల్లాలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని TTSF, GVS నాయకులు కోరారు. గురువారం డీఈఓకు వినతిపత్రం అందజేశారు. టీటీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మంగీలాల్, జీవీఎస్ కార్యదర్శి బాలాజీ నాయక్, జానకీరామ్ మాట్లాడుతూ.. ప్రైవేటు విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. విద్యా హక్కు చట్టాలకు విరుద్ధంగా నడుపుతున్న స్కూల్స్‌పై చర్యలు తీసుకోవాలన్నారు.

News September 18, 2025

కాణిపాకం ఆలయ చైర్మన్‌గా మణి నాయుడు

image

కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఆలయ ఛైర్మన్‌గా వి.సురేంద్ర నాయుడు అలియాస్ మణి నాయుడును నియమిస్తూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనూ ఆయన కాణిపాకం ఆలయ చైర్మన్‌గా విధులు నిర్వహించారు. రెండోసారి బాధ్యతలను అప్పజెప్పడంతో సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.