News November 26, 2025
NGKL: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం

NGKLలో ప్రభుత్వ (డిగ్రీ ఆర్ట్స్ అండ్ కామర్స్) కళాశాలలో నేడు పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ 76వ వార్షికోత్సవం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా.గీతాంజలి హాజరయ్యారు.అనంతరం పొలిటికల్ సైన్స్ విభాగం అధ్యాపకుడు నరేష్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి స్వేచ్ఛ, హక్కులు, అవకాశాలు, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు లభించడానికి కారణం రాజ్యాంగం అని అన్నారు.
Similar News
News November 26, 2025
హనుమాన్ చాలీసా భావం – 21

రామ దువారే తుమ రఖవారే |
హోత న ఆజ్ఞా బిను పైఠారే ||
శ్రీరాముని సన్నిధికి ఆంజనేయస్వామి ద్వారపాలకుడిగా ఉంటాడు. ఆయన అనుమతి లేకుండా శ్రీరాముని చెంతకు ఎవరూ చేరలేరు. ఆ శ్రీరాముడు మనల్ని చల్లగా చూడాలంటే హనుమంతుడి అనుగ్రహం కూడా తప్పనిసరి. రామయ్యకు అత్యంత ప్రీతిపాత్రుడైన, శక్తిమంతుడైన భక్తుడు హనుమంతుని పూజిస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది. త్వరగా మోక్షం లభిస్తుంది. <<-se>>#HANUMANCHALISA<<>>
News November 26, 2025
ఫైనల్‌కు ఉమ్మడి ఖమ్మం అండర్-19 గర్ల్స్ జట్టు

సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న అండర్-19 గర్ల్స్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశలో నాలుగు మ్యాచ్‌లలోనూ విజయం సాధించి పూల్ విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన సెమీఫైనల్‌లో మెదక్ జట్టుపై గెలిచిన ఖమ్మం జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్ పోరులో ఖమ్మం, హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.
News November 26, 2025
సేంద్రియ పెంపకం యూనిట్‌ను సందర్శించిన కలెక్టర్

సేంద్రియ ఉత్పత్తులకు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. బుధవారం పాల్వంచ కొత్తూరులోని చరిత సేంద్రియ కౌజు పిట్టల పెంపకం యూనిట్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సేంద్రియ పద్ధతులు, పరిశుభ్రత ప్రమాణాలు, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ విధానాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు.


