News March 24, 2025

NGKL: ప్రశాంతంగా కొనసాగుతున్న పదో తరగతి పరీక్షలు

image

నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు సజావుగా కొనసాగుతున్నాయి. సోమవారం నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్షకు 10,537 మంది హాజరయ్యారు, 25 మంది గైర్హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రమేష్ కుమార్ పరీక్షా కేంద్రాలను సందర్శించి, సీసీ కెమెరాల సమక్షంలో ప్రశ్నపత్రాలను ఓపెన్ చేసే విధానాన్ని పరిశీలించారు. డీఈఓ చీఫ్ సూపరింటెండెంట్‌లకు పరీక్షలు ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహించేందుకు సూచనలు ఇచ్చారు.

Similar News

News September 17, 2025

HYD: రోడ్లపై చెత్త వేస్తే ఒక్కో రకంగా జరిమానా

image

గ్రేటర్, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానా విధిస్తామని అనేక చోట్ల బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా.. ఫలితం లేకుండా పోతోంది. గ్రేటర్ పరిధిలో రోడ్లపై చెత్త వేస్తే రూ.1,000 జరిమానా వేస్తామని బోర్డులపై ఉండగా, అదే బోడుప్పల్ కార్పొరేషన్లలో రూ.25,000 జరిమాన వేస్తామని పేర్కొన్నారు. గ్రేటర్ కంటే కార్పొరేషన్లలోనే అధికంగా జరిమానా ఉన్నట్లు తెలుస్తోంది.

News September 17, 2025

ADB: గండర గండడు కొమురం భీముడే మన బిడ్డ..!

image

తెలంగాణ చరిత్రలో వీరత్వానికి, పోరాటానికి ప్రతీకగా నిలిచారు కొమురం భీమ్. 1901లో జన్మించిన ఈ గిరిజన యోధుడు, నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీల హక్కుల కోసం పోరాడారు. “జల్, జంగల్, జమీన్” అనే నినాదంతో గిరిజనులను ఏకం చేసి, తమ వనరులపై ఉన్న హక్కులను నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ​1940లో, జోడేఘాట్ వద్ద నిజాం పోలీసులతో జరిగిన పోరాటంలో కొమురం భీమ్ అమరుడయ్యారు. ఆయన ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటికీ ఆదర్శం.

News September 17, 2025

సంగారెడ్డి: ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

image

సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 22 నుంచి జరుగనున్న ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఇంటర్, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.