News March 15, 2025

NGKL: ప్రాణం తీసిన స్పీడ్ బ్రేకర్.!

image

బిజినేపల్లి (M) వెల్గొండకి చెందిన రమేశ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. వెల్గొండకి చెందిన రమేశ్ అతని స్నేహితుడు కలిసి బైక్‌పై బుద్దారం నుంచి బిజినేపల్లికి వస్తున్నారు. శాయిన్‌పల్లిలో స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపుతప్పి అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితుడికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఎత్తైన స్పీడ్ బ్రేకర్‌తో ప్రజల పాలిట మృత్యువుగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Similar News

News February 22, 2026

సంగారెడ్డి: త్వరలోనే రూ.20,737 కోట్లతో RRR పనులు

image

రీజనల్‌ రింగ్‌ రోడ్డు(RRR) ఉత్తర భాగం పనులకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్‌ నుంచి యాదాద్రి జిల్లా తంగడ్పల్లి వరకు 161.5 కి.మీల మేర ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేగా దీనిని నిర్మించనున్నారు. ఈ రహదారికి ఎన్‌హెచ్‌-161AAగా నామకరణం చేస్తూ రూ.20,737 కోట్లు కేటాయించారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.

News February 22, 2026

ఫేక్ వార్తలు నమ్మొద్దు: బాపట్ల కలెక్టర్

image

​సచివాలయాల్లో కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభమయ్యాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఫేక్ అని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఆ అప్లికేషన్ ఫారాలను నమ్మవద్దని సూచించారు. పింఛన్ తీసుకునే భర్త మరణిస్తే, భార్యకు వితంతు పింఛన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం మాత్రమే ప్రస్తుతం ఉందన్నారు. కొత్త పింఛన్లపై ప్రభుత్వం అధికారిక ప్రకటన వచ్చేవరకు వదంతులు నమ్మొద్దని కోరారు.

News February 22, 2026

28న GVMC కౌన్సిల్ చివరి సమావేశం

image

GVMC కౌన్సిల్ సమావేశం ఈనెల 28న జరగనుంది. 37 అంశాలతో అజెండాను సిద్ధం చేసి కార్పొరేటర్లకు అందజేశారు. విద్యుత్ విభాగంలోని ఒప్పంద కార్మికులను కొనసాగించేందుకు వేతనాల మంజూరు ప్రతిపాదించారు. పారిశుద్ధ్యం, భూగర్భ మురుగునీటి విభాగ కార్మికులకు పెంచిన వేతనాలు అమలు చేయనున్నారు. 81వ వార్డులో పైపులైన్ల మార్పు, 95వ వార్డులో రిటైనింగ్ వాల్, 1వ వార్డులో కాలువలు, 71వ వార్డులో బీటీ రహదారి పనులు అజెండాలో చేర్చారు.