News January 29, 2025

NGKL: ఫిజిక్స్ ఉపాధ్యాయ నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

image

బిజినేపల్లి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పీజీటీ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయ పోస్ట్ ఖాళీగా ఉంది. ఈ సందర్భంగా ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్ సుమతి ఓ ప్రకటనలో తెలిపారు. ఎంఎస్సీ బీఈడీ కెమిస్ట్రీ, లేదా ఎంఎస్సీ బీఈడీ ఫిజిక్స్ అభ్యర్థులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ప్రిన్సిపల్ తెలిపారు.

Similar News

News September 18, 2025

HYD: వైద్య సేవల బలోపేతంపై మంత్రి సమీక్ష

image

ఉస్మానియా మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రులలో వైద్య సేవల బలోపేతంపై మంత్రి దామోదర రాజనరసింహ ఎస్ఆర్ నగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రిలోని పాత భవనాల పరిస్థితిపై క్షేత్రస్థాయిలో పర్యటించి 2, 3 రోజుల్లో నివేదిక సమర్పించాలని TGMSIDC ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

News September 18, 2025

విశాఖ: ప్రేమ పేరుతో మోసం.. ముగ్గురి అరెస్ట్

image

అగనంపూడి యువతిని మోసం చేసిన మర్రిపాలేనికి చెందిన దుల్లా కిషోర్ కుమార్‌, అతడి స్నేహితులను దువ్వాడ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాలు.. కిషోర్ యువతిని ప్రేమ పేరుతో గర్భవతిని చేసి అబార్షన్ చేయించాడు. దీనికి శతీష్, వెంకటేష్ సహకరించారు. మోసపోయిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ముగ్గురిని స్టేషన్‌కు పిలిపించారు. మద్యం తాగి యువతిని బెదిరించడమే గాక అడ్డువచ్చిన పోలీసులపై తిరగబడ్డారు.

News September 18, 2025

3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్

image

AP: ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు బాపట్ల జిల్లాలోని సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న సీఎం చంద్రబాబు బీచ్‌ను సందర్శించి, రూ.97 కోట్ల అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. బాపట్ల పట్టణం నుంచి సూర్యలంక బీచ్ 9 కి.మీ దూరం ఉంటుంది.