News March 12, 2025
NGKL: బడ్జెట్‌పై జిల్లా ప్రజల్లో ఎన్నో ఆశలు.!

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలు బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో 4 నియోజకవర్గాలు ఉన్నాయి. అచ్చంపేట నియోజకవర్గంలో ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయింపు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి నిధుల కేటాయింపు, రోడ్లు, ప్రభుత్వ పథకాలకు నిధులు కేటాయించాలని కోరుతున్నారు.
Similar News
News March 12, 2025
VZM: ‘సారా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలి’

సారా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నాటుసారా నిర్మూలన సమన్వయ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. నాటు సారాకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబరు 14405 కు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు.
News March 12, 2025
ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా గిల్

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యారు. గత నెలలో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకుగానూ ఆయనను ఈ అవార్డు వరించింది. గత నెలలో 5 వన్డేలాడి 94.19 యావరేజ్, 101.50 స్ట్రైక్ రేట్‌తో 406 పరుగులు బాదారు. ఇందులో ఓ సెంచరీ సహా మూడు వరుస ఫిఫ్టీలు ఉన్నాయి. స్టీవ్ స్మిత్, గ్లెన్ ఫిలిప్స్ గట్టి పోటీ ఉన్నా వారిని వెనక్కి నెట్టి గిల్ ఈ అవార్డు దక్కించుకున్నారు.
News March 12, 2025
రన్యారావును నిద్రపోనివ్వడం లేదు: లాయర్లు

బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన నటి రన్యారావును డీఆర్ఐ అధికారులు నిద్రపోనివ్వడం లేదని ఆమె తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. మర్డర్ కేసుల్లోనే మహిళలకు బెయిల్ లభిస్తోందని, అలాంటప్పుడు బెయిల్ పొందడానికి రన్యా కూడా అర్హురాలని వాదనలు వినిపించారు. కాగా రన్యారావు దుబాయ్ నుంచి నడుము చుట్టూ, కాళ్ల కింద భాగం, షూలో 14 కిలోల బంగారం అక్రమంగా తీసుకువస్తూ డీఆర్ఐ అధికారులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే.