News February 1, 2025
NGKL: బాలికకు వేధింపులు.. కేసు నమోదు

ప్రేమ పేరుతో మైనర్‌ను వేధింపులకు గురిచేసిన యువకుడిపై శుక్రవారం పోక్సో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చారకొండకు చెందిన మహేశ్ అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల మైనర్‌ను వేధించేవాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News March 6, 2025
సంగారెడ్డి: ఫ్రీ ఫైనల్ పరీక్షలకు శాంపిల్ ఓఎంఆర్ షీట్: DEO

పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ప్రీ ఫైనల్ పరీక్షల్లో శాంపిల్ ఓఎంఆర్ షీట్లను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. సంగారెడ్డి నుంచి ఎంఈఓలు ప్రధాన ఉపాధ్యాయులతో జూమ్ సమావేశం బుధవారం నిర్వహించారు. ఇంగ్లీష్, గణితం పాఠ్యాంశాలకు ఓఎంఆర్ షీట్లను పంపిణీ చేస్తామని చెప్పారు. విద్యార్థులకు దీనిపై అవగాహన కల్పించాలని సూచించారు. DCEB కార్యదర్శి లింభాజీ పాల్గొన్నారు.
News March 6, 2025
WGL: 267 మంది ఆబ్సెంట్.. ఒక మాల్ ప్రాక్టీస్ కేస్

వరంగల్ జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ మొదటి రోజు ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం వరంగల్ జిల్లాలో 6,266 మొదటిరోజు 5,999 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. 267 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారు. మొదటి రోజు ఒకరు మాల్ ప్రాక్టీస్ చేస్తే పట్టుపడ్డారు.
News March 6, 2025
మెదక్: జిల్లాలో AIతో విద్యాబోధన: కలెక్టర్

మాసాయిపేట మండలంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విస్తృతంగా పర్యటించారు. పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో విద్యాబోధన కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో విద్యాబోధన అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాథమిక పాఠశాలలో అమలు సత్ఫలితాలు దిశగా ముందుకు పోతుందని తెలిపారు.