News December 20, 2025
NGKL: బాల్య స్నేహితులు.. సర్పంచ్‌లుగా గెలిచారు

ఒకేచోట చదువుకున్నారు.. ప్రాణ స్నేహితులుగా పెరిగారు.. పెళ్లిళ్ల తర్వాత వేర్వేరు గ్రామాలకు కోడళ్లుగా వెళ్లారు. ఇప్పుడు ఆ ఇద్దరు స్నేహితురాళ్లు చెరో గ్రామానికి సర్పంచులు అయ్యారు. బల్మూరు(M) పోలిశెట్టిపల్లికి A.జ్యోష్ణ కాంగ్రెస్, తెల్కపల్లి(M) పర్వతాపూర్ కోడలు కొట్ర ప్రసన్న రెడ్డి BRS సర్పంచులుగా గెలుపొందారు. ఇంటర్ వరకు కలిసి చదివిన స్నేహితులు సర్పంచ్‌లు కావడంతో సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Similar News
News December 20, 2025
కర్నూలు: మిరప పంటలో గంజాయి సాగు

చిప్పగిరి మండలం దేగులపాడు గ్రామ పరిధిలో మిరప పంటలో అంతర పంటగా గంజాయి సాగు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. పొలాన్ని తనిఖీ చేసి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 20, 2025
మన్నెంపల్లిలో వెలుగుచూసిన ‘వీరగల్లు’ శిల్పం

KNR(D)తిమ్మాపూర్(M)మన్నెంపల్లిలో పురాతన యుద్ధ సన్నివేశాన్ని ప్రతిబింబించే ‘వీరగల్లు’ శిల్పం లభ్యమైందని పురావస్తు పరిశోధకుడు ‘డిస్కవరీ మ్యాన్’ రెడ్డి రత్నాకర్ రెడ్డి తెలిపారు. కరణాలగడీ సమీపంలోని పాలకేంద్రం ఆవరణలో చెత్తాచెదారం శుభ్రంచేస్తుండగా ఈ శిల్పం బయటపడింది. సుమారు ఒకటిన్నర అడుగుల ఎత్తున్న నల్లరాతిపై ఒక సైనికుడు కుడిచేతిలో కత్తి, ఎడమచేతిలో కళ్లెం పట్టుకుని యుద్ధంచేస్తున్న దృశ్యం అద్భుతంగా ఉంది.
News December 20, 2025
షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌లో తాపేశ్వరం విద్యార్థుల జోరు

తాపేశ్వరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మెరిశారు. ఇంధన పొదుపుపై ఏపీ స్టేట్ ఎనర్జీ కన్సర్వేషన్ మిషన్ నిర్వహించిన షార్ట్ ఫిలిం పోటీల్లో వీరు ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు. శనివారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో విజేతలకు అవార్డులను అందజేశారు. ప్రధానోపాధ్యాయులు వాకాడ వెంకట రమణ నేతృత్వంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు బహుమతులను అందుకున్నారు.


