News February 5, 2025

NGKL: బావిలో మునిగి బాలుడు మృతి

image

వనపర్తి జిల్లా అమరచింత మండలం చంద్రప్ప తాండ శివారు బావిలో ఈతకు వెళ్లి ఓ బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. చిన్నచింత కుంట మద్దూరుకి చెందిన గొల్ల నాగరాజు కుమారుడు కురుమూర్తి (15) చంద్రప్ప తాండ శివారులోని ఓ వ్యవసాయ పొలంలో ఉన్న బావిలో ఈతకు వెళ్లాడు. ఈత కొడుతుండగా బాలుడు అస్వస్థతకు గురై కొట్టుమిట్టాడుతూ నీటిలో మునిగి మృతి చెందాడు. పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.

Similar News

News March 1, 2026

పెరిగిన జీఎస్టీ వసూళ్లు

image

AP: రాష్ట్రంలో గూడ్స్, సర్వీస్ ట్యాక్స్ వసూలు గతంలో కన్నా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం GST-2.0లో పలు వస్తువులపై ట్యాక్సుల భారాన్ని తగ్గించినా రాబడిలో పురోగతి నమోదైంది. 2026 FEBలో నెట్ వసూలు ₹3061 CR కాగా గ్రాస్ ₹3562 CRవసూలు అయ్యింది. అదే 2025 FEBలో నెట్ ₹2902CR కాగా గ్రాస్ ₹3569CRగా ఉంది. సెస్‌తో సంబంధం లేకుండా గ్రాస్ వసూళ్లు తగ్గినా నెట్ వసూళ్లలో మాత్రం ₹150 CR పెరుగుదల కనిపించింది.

News March 1, 2026

పసుపు రంగు రాసిన చికెన్ విక్రయిస్తే చర్యలు: బ్రహ్మాజీ

image

చికెన్ సెంటర్లలో కోడి మాంసాన్ని శుభ్రం చేసేటప్పుడు పసుపుకు బదులుగా కృత్రిమ రంగులు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ బ్రహ్మాజీ హెచ్చరించారు. ఆదివారం వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి చక్రపాణితో కలిసి ఆయన పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రసాయన రంగులు కలిపిన మాంసం తింటే ఉదర, పేగు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

News March 1, 2026

ఇరాన్ దాడుల్లో ముగ్గురు మృతి.. 58 మందికి గాయాలు: UAE

image

ఇరాన్ తమ దేశంపై చేసిన దాడుల్లో ముగ్గురు మరణించగా, 58 మంది గాయపడ్డారని UAE వెల్లడించింది. మృతులు పాక్, నేపాల్, బంగ్లాకు చెందిన వారు అని, గాయపడ్డ వారిలో భారత్‌తో పాటు మరో 14 దేశాల వారు ఉన్నారంది. 541 ఇరానియన్ డ్రోన్లు, 165 బాలిస్టిక్ మిస్సైల్స్, 2 క్రూయిజ్ క్షిపణులను ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఈరోజు ఉదయం 20 బాలిస్టిక్ మిస్సైళ్లను ధ్వంసం చేశామని, 8 సముద్రంలో పడ్డాయని పేర్కొంది.