News October 14, 2025
NGKL: బెస్ట్ అవైలబుల్ విద్యార్థులకు ఇబ్బందులు వద్దు: కలెక్టర్

బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పాఠశాలల విద్యార్థుల సంక్షేమంపై జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ విద్యార్థులను ఇబ్బంది పెట్టిన పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ తెలిపారు.
Similar News
News October 14, 2025
రేపు వరంగల్‌కు సీఎం.. షెడ్యూల్ ఇదే!

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ ఇటీవల మృతిచెందగా ఆమె దశదిన కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హనుమకొండలో మాధవరెడ్డిని బుధవారం పరామర్శించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హెలికాప్టర్ ద్వారా హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చి, 1:15కి వడ్డేపల్లిలోని పీజీఆర్ గార్డెన్‌కు చేరుకుంటారు. పరామర్శ అనంతరం 1:45కి హనుమకొండ కలెక్టరేట్‌కు చేరుకొని హెలికాప్టర్ ద్వారా తిరుగు పయనం అవుతారు.
News October 14, 2025
కబడ్డీ రాష్ట్రస్థాయి పోటీలకు ధర్మపురి విద్యార్థి

ఎస్జీఎఫ్ (SGF) రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడా పోటీలకు ధర్మపురి జిల్లా పరిషత్ బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థి ఎం.అఖిల్ ఎంపికయ్యాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న అఖిల్, 14 సంవత్సరాల విభాగంలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా రేపు జరిగే పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న అఖిల్‌కు ZP ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ ఏ. స్వప్న మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు.
News October 14, 2025
ఉమెన్స్ వరల్డ్ కప్: భారత్ సెమీస్ వెళ్లాలంటే?

SA, AUS చేతిలో ఓడిపోయిన టీమ్ఇండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. నెక్ట్స్ ఈనెల 19న ENG, 23న NZ, 26న బంగ్లాతో తలపడనుంది. బంగ్లా మినహా ENG, NZపై భారత రికార్డు పేలవంగా ఉంది. కానీ వీటితో చివరగా జరిగిన సిరీస్‌ల్లో INDనే పైచేయి(2-1) సాధించింది. లీగ్‌లో మిగిలిన 3 మ్యాచ్‌ల్లో గెలిస్తే నేరుగా సెమీస్‌కు వెళ్లే అవకాశముంది. లేదంటే కనీసం 2 గెలిచి, మెరుగైన NRR మెయింటెన్ చేస్తే క్వాలిఫై అవ్వొచ్చు.