News February 11, 2025
NGKL: బైక్ కొనివ్వనన్నందుకు తండ్రి ఆత్మహత్యాయత్నం

కోడేరు మండల కేంద్రంలో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. కోడేరుకు చెందిన వెంకటశేషయ్య బైక్ కొనివ్వాలని తన కొడుకుని అడిగారు. దీనికి కొడుకు అంగీకరించకపోవటంతో.. ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగారు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు.
Similar News
News December 26, 2025
GNT: మృతిచెందిన వృద్ధురాలు మీకు తెలుసా.?

గుంటూరు కలెక్టరేట్ వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న గుర్తు తెలియని వృద్ధురాలిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు నగరంపాలెం పోలీసులు తెలిపారు. గురువారం వృద్ధురాలు పడిపోయి ఉన్నట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది ఆసుపత్రిలో చేర్చారన్నారు. చికిత్స పొందుతూ మరణించిన ఆమె ఆచూకీ తెలిసిన వారు స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.
News December 26, 2025
మామిడిలో బోరాన్ ఎప్పుడు స్ప్రే చేయాలి?

మామిడి పంట లేత పూమొగ్గ, పిందె దశలలో (గోళీ సైజులో ఉన్నప్పుడు) బోరాన్ పిచికారీ చేయడం వలన మంచి ఫలితాలు వస్తాయి. పూమొగ్గ దశలలో బోరాన్ పిచికారీ చేయడం వల్ల ఫలదీకరణ మెరుగుపడుతుంది. బోరాన్ పుప్పొడి మొలకెత్తడానికి, పుప్పొడి నాళం పెరుగుదలకు చాలా అవసరం. ఫలదీకరణకు, పండ్ల అభివృద్ధికి కీలకంగా పని చేస్తోంది. అంతేకాకుండా పూత రాలడం తగ్గి, పిందె నిలబడడం పెరుగుతుంది. పండ్లు పగలకుండా ఉంటాయి.
News December 26, 2025
జైలర్-2లో షారుఖ్ ఖాన్!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా జైలర్-2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. దీనిపై నటుడు మిథున్ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో లీక్ ఇచ్చారు. జైలర్-2లో మోహన్ లాల్, షారుఖ్ ఖాన్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్లు నటిస్తున్నారని చెప్పారు. మూవీలో విలన్‌గా మిథున్ కనిపించనున్నారు. నెల్సన్ దిలీప్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూన్‌లో రిలీజ్ కానుంది.


