News October 16, 2025
NGKL: మంత్రాల మాటున మాయ.. భర్త హత్య

NGKL జిల్లా శ్రీపురానికి చెందిన రాములును తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని OCT 12 భార్య మానస, ప్రియుడు సురేశ్ హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. రాములు ఇంట్లో 6 నెలల క్రితం <<18015644>>బంగారం<<>> చోరీ కావడంతో సురేశ్ మంత్రశక్తితో కనిపెడతానని ఫ్యామిలీకి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో మానసతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇంట్లో విషయం తెలియడంతో గొడవలు జరిగాయి. భర్త అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసి హతమార్చారు.
Similar News
News October 16, 2025
పవన్ అపాయింట్మెంట్ కోసం వినుత వెయిటింగ్!

DCM పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం వినుత కోట దంపతులు ఎదురు చూస్తున్నారట. తనకు జరిగిన అన్యాయంపై పూర్తి ఆధారాలు అధినేత వద్ద చేర్చేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. వారం రోజులవరకు వేచి చూసి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మీడియా ముందుకు ఆ ఆధారాలు బయట పెడుతారని వినుత వర్గీయుల మధ్య చర్చ సాగుతోంది.
News October 16, 2025
వరదలతో భవానీ ఐలాండ్ టూరిజానికి రూ.1.8 కోట్ల నష్టం

కృష్ణా నదికి వచ్చిన వరదలతో విజయవాడ భవానీ ఐలాండ్ మూతపడింది. దాదాపు 60 రోజులపాటు టూరిస్టులు రాకపోవడంతో బోటింగ్‌కు రూ.1.5కోట్లు, బరంపార్కులో కొన్ని ఫంక్షన్లు రద్దు కావడం, టూరిస్టులు రాకపోవడంతో రూ.30 లక్షల వరకు నష్టం వచ్చినట్లు అధికారిక వర్గాల సమాచారం. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టడంతో మూడు రోజుల నుంచి టూరిస్టుల రాక పెరగడంతో బోటింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రూ.1.40 లక్షల ఆదాయం రోజుకు వస్తోంది.
News October 16, 2025
మక్తల్: దొంగల దాడి.. ఇంటి యజమానికి గాయాలు

మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తగార్లపల్లిలో గురువారం అర్ధరాత్రి దొంగలు ఇంట్లోకి చొరబడి మహిళ మెడలోని పుస్తెలతాడు లాక్కోవడానికి యత్నించారు. అడ్డుకున్న ఇంటి యజమాని అంజిలప్పను రాడ్‌తో దెబ్బకొట్టి గాయపరిచారు. ఆ మహిళ అరుపులు కేకలు వేయడంతో గ్రామస్థులు పరుగున చేరుకునే లోపు ముగ్గురిలో ఇద్దరు దొంగలు పరారయ్యారు. ఒక దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.