News October 9, 2025

NGKL: మద్యం దుకాణాలకు 41 దరఖాస్తులు

image

నాగర్ కర్నూల్ జిల్లాలోని 67 మధ్య షాపులకు గాను బుధవారం వరకు 41 దరఖాస్తులు వచ్చాయి. కాగా బుధవారం ఒక్కరోజే 17 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈనెల 18 సాయంత్రం 5 గంటల వరకు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నాగర్ కర్నూల్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 26, కొల్లాపూర్ పరిధిలో 2, కల్వకుర్తి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 7, తెలకపల్లి పరిధిలో 6 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.

Similar News

News October 9, 2025

స్థానిక సమరం.. రంగారెడ్డి రెడీ

image

స్థానిక సంస్థల ఎన్నికలకు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. ఎన్నికలపై హైకోర్టు బుధవారం అభ్యంతరం చెప్పకపోవడంతో నేటి నుంచి MPTC/ZPTC నోటిఫికేషన్ విడుదల కానుంది. రంగారెడ్డి జిల్లాలో 21 ZPTC స్థానాలు, 230 MPTC స్థానాలు ఉన్నాయి. అక్టోబర్‌లో 2 విడతల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. నవంబర్ 11న ఫలితాలు ప్రకటించనున్నారు. ఇక జిల్లాలో మొత్తం 526 పంచాయతీలు ఉండగా.. 4,668 వార్డులు ఉన్నాయి.

News October 9, 2025

జూబ్లీహిల్స్‌లో గెలుపు ఎవరిది?

image

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుస్తామని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన ఇంటి వద్ద రాత్రి సంబరాలు జరిగాయి. లోకల్‌గా స్ట్రాంగ్ లీడర్ కావడంతో ఈబైపోల్‌లో టఫ్ ఫైట్ తప్పేలా లేదు. ఇక BRS నుంచి మాగంటి సునీత బరిలో ఉన్నారు. BJP అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ప్రధాన పార్టీల మధ్యనే పోటీ ఉంది. జూబ్లీహిల్స్‌లో గెలుపు ఎవరిది.. మీ కామెంట్?

News October 9, 2025

శ్రీకాకుళం: రూ.40.23 కోట్లతో రోడ్ల అభివృద్ధి.!

image

శ్రీకాకుళం జిల్లాలో రూ.40.23 కోట్ల ఖర్చుతో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. జిల్లాలో 101.15 కిలోమీటర్ల మేర గుంతలు లేని రోడ్లు మరమ్మతులు కోసం ఈ నిధులు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో జిల్లాలోని ఆర్ అండ్ బి, ప్రధాన, జాతీయ రహదారులు అభివృద్ధి జరగనున్నాయి. ఆయా రోడ్డుల అభివృద్ధికి జిల్లా ఆర్ అండ్ బి అధికారులు పనులు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.