News October 10, 2025
NGKL: మద్యం దుకాణాలకు 51 దరఖాస్తులు

నాగర్ కర్నూల్ జిల్లాలో మద్యం దుకాణాలకు ఇప్పటివరకు 51 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు. జిల్లాలో మొత్తం 67 దుకాణాలకు గాను ఇప్పటివరకు 51 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. నాగర్ కర్నూల్ పరిధిలో 30, తెలకపల్లి పరిధిలో 6, కొల్లాపూర్ పరిధిలో 2, కల్వకుర్తి పరిధిలో 13 దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 18 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
Similar News
News October 10, 2025
213 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 213 పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఎల్లుండి వరకు (OCT 12) అవకాశం ఉంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు UPSC వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. వీటిలో అడిషనల్ గవర్నమెంట్ అడ్వకేట్, అడిషనల్ లీగల్ అడ్వైజర్, అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్, డిప్యూటీ లీగల్ అడ్వైజర్, మెడికల్ ఆఫీసర్, అకౌంట్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి వివిధ అర్హతలున్నాయి.
News October 10, 2025
సంగారెడ్డి: 12న జిల్లాలో పల్స్ పోలియో

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 12 నుంచి 14 వరకు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ నాగ నిర్మల తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 1,137 పోలియో బూత్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలు 1,91,668 మంది ఉన్నారు. చిన్నారులందరికీ తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించాలని ఆమె సూచించారు.
News October 10, 2025
రాష్ట్రస్థాయి బాక్సింగ్‌కు నిర్మల్ క్రీడాకారులు

అండర్ 17 బాలికల రాష్ట్రస్థాయి SGF పోటీలకు నిర్మల్ జిల్లా నుంచి ఏడుగురు క్రీడాకారులు ఎంపికైనట్లు జిల్లా బాక్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీధర్ తెలిపారు. నికిత (భైంసా), కీర్తన (నిర్మల్), అభినయ (నర్సాపూర్), శ్రావణి(ఖానాపూర్), పల్లవి ( బాసర), కవిత(జామ్), సంజన(నిర్మల్) ఎంపికైనట్లు వెల్లడించారు. వారిని జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ చందుల స్వామి, SGF సెక్రటరీ రవీందర్ గౌడ్ అభినందించారు.