News March 12, 2025
NGKL: మహిళ ఆత్మహత్య.. వ్యక్తి అరెస్ట్.!

అచ్చంపేట పట్టణంలో ఈనెల 6న చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందిన ఆవుల లక్ష్మి (37) కేసులో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. మృతురాలి తండ్రి మేకల నిరంజన్ ఫిర్యాదు మేరకు పట్టణానికి చెందిన బుద్దుల పర్వతాలు అనే వ్యక్తిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం అచ్చంపేట కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించినట్లు తెలిపారు.
Similar News
News December 14, 2025
విశాఖలో ఉత్సాహంగా నేవీ మారథాన్

నేవీ డే వేడుకల్లో భాగంగా విశాఖపట్నం బీచ్ రోడ్డులో ఆదివారం ఉదయం ‘నేవీ మారథాన్’ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్, నేవీ అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగిన ఈ మారథాన్‌లో నగర వాసులు, నేవీ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
News December 14, 2025
లోక్యతండా సర్పంచ్‌గా మౌనిక

రెండో విడత సర్పంచ్ ఫలితాలు వెలువడుతున్నాయి. నర్మెట్ట మండలంలోని లోక్యాతండాలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మౌనిక 41 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. గ్రామంలో మొత్తం 8 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికై ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రశాంత వాతావరణంలో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ పూర్తికాగా ప్రజలు ప్రజాస్వామ్య పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.
News December 14, 2025
ప్రభుత్వ కార్యాలయాలలో రేపు PGRS: విశాఖ కలెక్టర్

విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో డిసెంబర్ 15న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, జోనల్ కార్యాలయాల్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు స్వీకరించనున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


