News February 10, 2026

NGKL: మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్ పై నిషేధం

image

జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉన్నట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎన్నికలతో ముడిపడిన అంశాలపై ఎవరు కూడా పత్రిక ప్రకటనలు చేయరాదని సూచించారు. నాయకులు పత్రికా సమావేశాలు నిర్వహించకూడదని తెలిపారు. ఎన్నికల సంఘం నుంచి అనుమతి పొందిన అధికారులు మాత్రమే మాట్లాడాలని అన్నారు.

Similar News

News February 12, 2026

MDK: యాక్సిడెంట్‌లో తల్లి మృతి.. కొడుకు, కోడలికి గాయాలు

image

శివంపేట మం. గోమారం సమీపంలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో బిజిలిపూర్‌కు చెందిన జుబేదా(55) మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఆమె కొడుకు, కోడలిని మెరుగైన చికిత్స కోసం కొంపల్లిలో ఓ ఆస్పత్రికి తరలించారు. బైక్ మెకానిక్ సాదక్.. భార్య అజీరా, తల్లి జుబేదాతో కలిసి గోమారం వైపు వెళ్తుండగా కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు శివంపేట పోలీసులు తెలిపారు.

News February 12, 2026

పొంగులేటి vs కూనంనేని.. గెలుపెవరిది?

image

గత అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, సీపీఐ.. కొత్తగూడెం కార్పొరేషన్ బరిలో మాత్రం ప్రత్యర్థులుగా తలపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం మంత్రి పొంగులేటి, సీపీఐ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే కూనంనేని గట్టి ప్రచారం నిర్వహించారు. ఇద్దరు అగ్రనేతలు తమ అభ్యర్థుల కోసం శ్రమించడంతో గెలుపు ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. వీరిద్దరిలో నెగ్గేదెవరో రేపటి ఫలితాల్లో తేలనుంది.

News February 12, 2026

SKLM : మహిళపై దాడి.. ఒకరిపై కేసు

image

కోటబొమ్మాళి మండలం కన్నెవలస గ్రామానికి చెందిన కాళ్ల సింహాద్రమ్మ తనపై దాడి చేసి గాయపరిచారని అదే గ్రామానికి చెందిన దేవాది అప్పలమ్మ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాగునీటి కుళాయి వద్ద నీరు పట్టుకుంటున్న సమయంలో వెనుక నుంచి వచ్చి కొట్టి గాయపరిచినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వి. సత్యనారాయణ తెలిపారు.