News January 28, 2026
NGKL: మున్సిపల్ ఎన్నికల తొలిరోజు 32 నామినేషన్లు

నాగర్ కర్నూల్ జిల్లావ్యాప్తంగా బుధవారం మొదటిరోజు 32 నామినేషన్లు దాఖలయ్యాయి. కల్వకుర్తిలో 14, నాగర్ కర్నూల్‌లో 11, కొల్లాపూర్‌లో 7 నామినేషన్లు వచ్చినట్లు కలెక్టర్ సంతోశ్ తెలిపారు. నామినేషన్ల స్వీకరణకు మరో రెండు రోజులు గడువు ఉందని, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని ఆయన పేర్కొన్నారు.
Similar News
News January 28, 2026
గన్నవరం చేరుకున్న మోహన్ భగవత్

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ బుధవారం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. బెంగళూరు నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ఆయనకు విమానాశ్రయ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆయన రాకను పురస్కరించుకొని విమానాశ్రయ ప్రాంగణంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అనంతరం ఆయన గన్నవరం నుంచి రోడ్డు మార్గాన విజయవాడ కరకట్టపై ఉన్న గోకరాజు గంగరాజు ఆశ్రమానికి బయలుదేరి వెళ్లారు.
News January 28, 2026
VZM: ‘రాజకీయ పార్టీలు బీఎల్‌ఏలను నియమించాలి’

గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలు తప్పనిసరిగా బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) నియమించుకోవాలని జిల్లా రెవిన్యూ అధికారి ఈ. మురళి సూచించారు. బుధవారం తన ఛాంబర్‌లో రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. బీఎల్‌ఏల ద్వారా ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపులు, మరణించిన ఓటర్ల వివరాలు సులభంగా గుర్తించవచ్చన్నారు. జిల్లాలో మొత్తం 15,74,815 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.
News January 28, 2026
ఇందిరమ్మ ఇళ్లు.. లంచం అడిగితే ఈ నంబర్‌కు కాల్ చేయండి!

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ స్పష్టం చేశారు. లబ్ధిదారుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ హౌసింగ్ ఏఈ శ్రీకాంత్‌ను బ్లాక్ లిస్టులో పెట్టామని తెలిపారు. అధికారులు నిరాకరిస్తే ఇళ్ల ఫొటోలు లబ్ధిదారులే యాప్‌లో పెట్టవచ్చని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌లో లంచం అడిగితే 1800 599 5991కు కాల్ చేయాలని సూచించారు.


