News February 11, 2026

NGKL: మూడు మున్సిపాలిటీల్లో 65 వార్డులకు నేడే పోలింగ్

image

నాగర్ కర్నూల్ జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 65 వార్డులకు గాను ఎన్నికలు జరుగుతున్నాయి. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో 24 వార్డులకు 35,378 మంది ఓటర్లు, కల్వకుర్తి మున్సిపాలిటీలో 22 వార్డులకు 26,034 మంది, కొల్లాపూర్ మున్సిపాలిటీలో 19 వార్డులకు 19,470 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

Similar News

News February 20, 2026

‘అవిశ్వాసం’పై INCని ఒంటరి చేసేలా NDA వ్యూహం

image

LS స్పీకర్ ఓం బిర్లాపై INC, ‘ఇండీ’ పక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై MAR 9న చర్చ, ఓటింగ్ జరగనుంది. దీన్ని తిప్పికొట్టేందుకు తగినంత బలం ఉన్నాINCని మరింత ఒంటరి చేసేలా NDA కొత్త వ్యూహంతో వెళ్తోంది. సభలో రాహుల్‌ను మాట్లాడనివ్వలేదన్న కారణంతో ఇచ్చిన ఈ తీర్మానంపై TMC సంతకం చేయలేదు. ఇది INC సొంత వ్యవహారంలా మారిందని ఇతర MPలూ విమర్శిస్తున్నారు. దీంతో వారి మద్దతు ఉపసంహరించేలా NDA తెరవెనుక ప్రయత్నిస్తోంది.

News February 20, 2026

జిల్లా రిజిస్ట్రార్‌గా జగన్మోహనరావు బాధ్యతల స్వీకారం

image

తూ.గో. జిల్లా నూతన రిజిస్ట్రార్‌గా కె.జగన్మోహనరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 1993లో జూనియర్ అసిస్టెంట్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, సీనియర్ అసిస్టెంట్‌గా, గ్రేడ్-2, గ్రేడ్-1 సబ్ రిజిస్ట్రార్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు. మచిలీపట్నం సబ్ రిజిస్ట్రార్‌గా సేవలందిస్తూ పదోన్నతిపై ఇక్కడకు విచ్చేశారు. ఈ సందర్భంగా పలువురు సబ్ రిజిస్ట్రార్‌లు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

News February 20, 2026

ఏఐ వార్‌రూమ్‌కు HYD అనువైన ప్రదేశం: CM రేవంత్

image

హైదరాబాద్‌ వచ్చి ఏఐ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో టెక్నాలజీ దిగ్గజాలను TG CM రేవంత్ కోరారు. ‘ఏఐ శకం ఇప్పటికే మొదలైంది. మనిషి కంటే ఇది ఎక్కువ తెలివితేటలు కలిగి ఉంది. భారతీయులు ఎక్కువగా సోషల్ మీడియా వాడతారు. ఏఐ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదగాలి. ఏఐ అభివృద్ధి కోసం ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయాలి. అందుకు హైదరాబాద్ ఎంతో అనువైన ప్రదేశం’ అని సీఎం వివరించారు.