News October 9, 2025
NGKL: మొదటి విడతలో 10 జడ్పీటీసీ, 115 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

నాగర్ కర్నూల్ జిల్లాలో మొదటి విడతలో 10 జడ్పీటీసీ, 115 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలోని నాగర్ కర్నూల్, తెలకపల్లి, తాడూరు, బిజినేపల్లి, తిమ్మాజీపేట, కల్వకుర్తి, ఊరుకొండ, వెల్దండ, వంగూరు, చారకొండ, మండలాల్లోని జడ్పీటీసీల తోపాటు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నేడు ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
Similar News
News October 9, 2025
జూబ్లీహిల్స్‌లో గెలుపు ఎవరిది?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుస్తామని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన ఇంటి వద్ద రాత్రి సంబరాలు జరిగాయి. లోకల్‌గా స్ట్రాంగ్ లీడర్ కావడంతో ఈబైపోల్‌లో టఫ్ ఫైట్ తప్పేలా లేదు. ఇక BRS నుంచి మాగంటి సునీత బరిలో ఉన్నారు. BJP అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ప్రధాన పార్టీల మధ్యనే పోటీ ఉంది. జూబ్లీహిల్స్‌లో గెలుపు ఎవరిది.. మీ కామెంట్?
News October 9, 2025
సిద్దిపేట: అత్యాచారం కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష

అత్యాచారం, పెళ్లి చేసుకుంటానని ఓ ఉపాధ్యాయురాలిని మోసం చేసిన కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.1.50 లక్షల జరిమానా విధిస్తూ సిద్దిపేట అడిషనల్ జడ్జి జయ ప్రసాద్ తీర్పు ఇచ్చారని సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. బాధితురాలికి రూ.5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారని కమిషనర్ తెలిపారు.
News October 9, 2025
స్థానిక సమరం.. రంగారెడ్డి రెడీ

స్థానిక సంస్థల ఎన్నికలకు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. ఎన్నికలపై హైకోర్టు బుధవారం అభ్యంతరం చెప్పకపోవడంతో నేటి నుంచి MPTC/ZPTC నోటిఫికేషన్ విడుదల కానుంది. రంగారెడ్డి జిల్లాలో 21 ZPTC స్థానాలు, 230 MPTC స్థానాలు ఉన్నాయి. అక్టోబర్‌లో 2 విడతల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. నవంబర్ 11న ఫలితాలు ప్రకటించనున్నారు. ఇక జిల్లాలో మొత్తం 526 పంచాయతీలు ఉండగా.. 4,668 వార్డులు ఉన్నాయి.