News March 6, 2025
NGKL: యువకుడి ఆత్మహత్య

NGKL జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మారేడుమాన్ దిన్నె గ్రామానికి చెందిన కేతావత్ మైబు నాయక్(23) బుధవారం సాయంత్రం మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగారు. మైబు నాయక్ అందరితో ప్రేమగా, మైత్రిగా ఉండే వ్యక్తి అని గ్రామస్థులు భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు.
Similar News
News September 14, 2025
తిరుమల శ్రీవారి దర్శనానికి 24గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి సర్వదర్శనం క్యూ లైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ నుంచి కొనసాగుతోంది. వేంకటేశ్వరస్వామి దర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. శనివారం 82,149 మంది స్వామి వారిని దర్శించుకోగా 36,578 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.85 కోట్లు వచ్చిందని ప్రకటించింది.
News September 14, 2025
HYD: 1000 టన్నుల నిమజ్జన వ్యర్ధాలు తొలగింపు

వినాయక విగ్రహాల నిమజ్జనం తర్వాత హుస్సేన్‌సాగర్‌తో పాటు చుట్టూ ఉన్న రోడ్లు, ఫుట్‌పాత్‌ల నుంచి GHMC, HMDA సిబ్బంది 1000 టన్నుల నిమజ్జన వ్యర్థాలు, చెత్తాచెదారం తొలగించారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ 500 మంది పారిశుద్ధ్య కార్మికులు చెత్త తొలగింపులో నిమగ్నం అయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నిమజ్జన వ్యర్థాలు 150 టన్నుల మేర అదనంగా తొలగించినట్లు అధికారులు తెలిపారు.