News April 1, 2025

NGKL: యువతి ఒంటరిగా రావడం అదునుగా తీసుకున్నారు: ఐజీ

image

NGKL జిల్లా ఊర్కొండపేట ఆలయానికి వచ్చిన వివాహిత గ్యాంగ్ రేప్ జరిగిన ఘటనా స్థలాన్ని ఈరోజు మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ పరిశీలించి మాట్లాడారు. అత్యాచారం చేసిన మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశామని, ఆమె ఒంటరిగా రావడాన్ని వారు అదునుగా తీసుకున్నారని తెలిపారు. యువతిని బెదిరించి అత్యాచారం చేశారని, నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపిస్తామన్నారు.

Similar News

News April 2, 2025

UPI పేమెంట్స్ చేసేవారికి మళ్లీ షాక్

image

ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యాప్స్‌లో యూపీఐ పేమెంట్స్ మరోసారి నిలిచిపోయాయి. గతవారం కూడా ట్రాన్సాక్షన్స్ ఫెయిల్డ్ కాగా ఇవాళ సాయంత్రం నుంచి పేమెంట్స్ కావడం లేదంటూ యూజర్లు సోషల్ మీడియాలో తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో పంపుతున్న డబ్బులు ప్రాసెసింగ్‌లో పడి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మండిపడుతున్నారు. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? కామెంట్ చేయండి.

News April 2, 2025

ఛత్రపతి శివాజీ 100శాతం లౌకికవాది: గడ్కరీ

image

ఛత్రపతి శివాజీ ఎన్నో యుద్ధాలు గెలిచారు కానీ ఎప్పుడూ ఏ మసీదునూ కూల్చలేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ‘ఛత్రపతి శివాజీ నిజమైన పాలకుడికి, తండ్రికి ప్రతీక. ఆయన వందశాతం లౌకికవాది. చాలామంది పెద్ద నాయకులవ్వగానే కులం, మతం గురించి మాట్లాడుతుంటారు. అలా మాట్లాడటం సరికాదని నేను చాలామందిని హెచ్చరిస్తుంటాను’ అని తెలిపారు.

News April 2, 2025

RTC ఉద్యోగుల పిల్లలకు ర్యాంకులు.. సజ్జనార్ సన్మానం

image

TG:గ్రూప్-1 ఫలితాల్లో ఉద్యోగాలు పొందిన TGSRTC ఉద్యోగుల పిల్లలను సంస్థ MD సజ్జనార్ సన్మానించారు. గ్రూప్-1 రిజల్ట్స్‌లో నారాయణపేట డిపోకు చెందిన కండక్టర్ శ్రీనివాస్ కుమార్తె వీణ 118వ ర్యాంక్, TI-2గా పనిచేస్తున్న వాహిద్ కుమార్తె ఫాహిమినా 126వ ర్యాంక్, వనపర్తి డిపోకు చెందిన కండక్టర్ పుష్పలత కుమారుడు రాఘవేందర్ 143వ ర్యాంకులు సాధించారు. RTC ఉద్యోగుల పిల్లలు రాణించడం చాలా సంతోషంగా ఉందని సజ్జనార్ అన్నారు.

error: Content is protected !!