News February 23, 2025
NGKL: యువతి SUICIDE

కల్వకుర్తిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాలిలా.. పట్టణంలోని ఇందిరానగర్‌లో ఉంటున్న అనూష(20) డిగ్రీ చదువుతోంది. ఈ క్రమంలో ఇంటర్ విద్యార్థి ఆమె ప్రేమించుకుంటున్నారు. కాగా.. మంగళవారం సదరు విద్యార్థితో అనూష ఫోన్ మాట్లాడిన అనంతరం పురుగు మందు తాగగా.. చికిత్స పొందుతూ బుధవారం చనిపోయింది. పోస్టుమార్టంలో యువతి గర్భందాల్చినట్లు ఆరోపణలున్నాయి. కేసు నమోదైంది.
Similar News
News February 5, 2026
కామారెడ్డి: హత్య చేసిన వారిని శిక్షించాలి

న్యాయవాది స్వప్నను దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేశ్ డిమాండ్ చేశారు. ఆమె హత్యను నిరసిస్తూ న్యాయవాదులు గురువారం విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
News February 5, 2026
SKLM: ఈ -ఆటోలను ప్రారంభించిన కలెక్టర్

స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా పంపిణీ జరిగిన 8 ఎలక్ట్రానిక్ వాహనాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆయన కార్యాలయం ఆవరణలో జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ..పరిశుభ్రతను పాటించాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రధానమైన పరిశుభ్రతపై అధికారులు, సిబ్బంది బాధ్యత వహించి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సౌజన్య, తదితరులున్నారు.
News February 5, 2026
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలి: అనంత వెంకటరామిరెడ్డి

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచేలా చర్యలు తీసుకుంటే, చంద్రబాబు సీఎం అయ్యాక పనులు నిలిపివేయడం అన్యాయమన్నారు. సీమ ప్రయోజనాల కోసం హంద్రీనీవా, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.


