News January 17, 2026
NGKL: రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మనోళ్లను గెలిపించండి: సీఎం

రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మనోళ్లను గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించామని, మరింత అభివృద్ధి కావాలంటే ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News February 21, 2026
సిరిసిల్ల: రోడ్డు ప్రమాదం.. బోల్తా కొట్టిన ఆటో

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్ హనుమాన్ ఆలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముస్తాబాద్ మండలం గూడూరుకు చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆటోలో తంగళ్లపల్లి మైనారిటీ పాఠశాలకు వెళ్తుండగా వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థినీలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 21, 2026
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు: కామారెడ్డి SP

కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసులను లక్ష్యంగా చేసుకుని కారుతో అతివేగంగా దూసుకెళ్లిన నిందితుడు గిరెడ్డి మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పాత నేర చరిత్ర కలిగిన ఇతడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని, విద్వేషాలకు తావులేకుండా మత సామరస్యాన్ని కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
News February 21, 2026
శాంతియుతంగా పండుగలు జరుపుకుందాం: సీపీ

రాబోయే ఉగాది, హోలీ, రంజాన్ పండుగలను ప్రజలందరూ సోదరభావంతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య పిలుపునిచ్చారు. శనివారం కమిషనరేట్‌లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా గంగా-జమునా తెహజీబ్‌కు ప్రతీక అని కొనియాడారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


