News February 19, 2026

NGKL: రాష్ట్రస్థాయి పోటీలలో సత్తా చాటిన దివ్యాంగ విద్యార్థులు

image

హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్రస్థాయి దివ్యాంగుల విద్యార్థుల క్రీడలలో నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. క్రీడలలో పాల్గొని సత్తా చాటిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం సాయంత్రం అభినందించారు. జిల్లాకు చెందిన తులసీదర్, నాని, శ్రీ వర్ధన్, విద్యార్థులు క్రీడలలో సత్తా చాటి జిల్లాకు పేరు తేవడం గర్వకారణమని అన్నారు.

Similar News

News February 20, 2026

కాట్రేనికోనలో కారు టైరు పేలి బీభత్సం.. బైకును ఈడ్చుకెళ్లి..

image

కాట్రేనికోన(M) చెయ్యేరు పంచాయతీ పరిధిలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిపై వెళ్తున్న కారు టైరు పంచర్ కావడంతో నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న కాట్రేనికోనకు చెందిన యువకుడిని కారు సుమారు 10 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 20, 2026

అల్లూరి: గ్రీవెన్స్‌కు పోటెత్తిన అర్జీదారులు

image

అల్లూరి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌కు అర్జీదారులు పోటెత్తారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ ప్రజా వినతుల పరిష్కార వేదికకు జిల్లాలోని మారుమూల నుంచి తమ సమస్యలను చెప్పుకునేందుకు వస్తున్నారు. సమస్యలు వెంటనే పరిష్కారం అవుతుండడంతో అర్జీదారుల సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం పాడేరులో నిర్వహించిన ఈ గ్రీవెన్స్‌కు 100మంది అర్జీదారులు వచ్చారు. వీరి సమస్యలను ఆర్డీఓ లోకేశ్వర్ తెలుసుకున్నారు.

News February 20, 2026

ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 20 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ(MBA/PGDBA/PGDBM/MMS), ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో పాటు ICAIలో సభ్యత్వం ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.eximbankindia.in