News October 30, 2025

NGKL: రేపు ‘డయల్‌ యువర్ డీఎం’

image

రేపు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆర్టీసీ డీఎం యాదయ్య తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా ప్రజలు 9959226288కు కాల్ చేసి తమ సలహాలు, సూచనలు తెలియజేయాలని ఆయన సూచించారు.

Similar News

News October 30, 2025

బాధిత కుటుంబాలకు చిత్తూరు ఎస్పీ సాయం

image

ప్రమాదాలకు గురైన పోలీసు కుటుంబాలకు చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ గురువారం ఆర్థిక సాయం అందజేశారు. చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మురుగేషన్, సాయుధ దళంలో విధులు నిర్వహిస్తున్న రవితేజ నాయక్ ఇటీవల రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. బాధిత కుటుంబ సభ్యులకు IDRF ఫండ్ నుంచి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున ఎస్పీ చెక్కులను అందజేశారు. కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.

News October 30, 2025

IPL: ముంబైని రోహిత్ వీడతారా? క్లారిటీ

image

రాబోయే IPL సీజన్‌లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌(MI)ను వీడతారనే ఊహాగానాలకు బ్రేక్ పడింది. హిట్‌మ్యాన్ MIని వీడతారనే ప్రచారాన్ని తోసిపుచ్చుతూ ఆ ఫ్రాంచైజీ ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘సూర్యుడు తిరిగి ఉదయిస్తాడు’ అనే క్యాప్షన్‌తో రోహిత్ ఫొటోను షేర్ చేసింది. ఈ ట్వీట్‌తో ముంబై జట్టులో రోహిత్ కొనసాగింపుపై క్లారిటీ వచ్చినట్లైంది. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

News October 30, 2025

JIO యూజర్లకు ₹35,100 విలువైన గూగుల్ AI సేవలు ఫ్రీ!

image

JIO & GOOGLE భాగస్వామ్యంతో జియో యూజర్లకు 18 నెలల పాటు ఉచితంగా (₹35,100 విలువైన) గూగుల్ AI Pro సేవలు లభించనున్నాయి. ఈ ప్లాన్‌లో Gemini 2.5 Pro, ఇమేజ్-వీడియో క్రియేషన్ టూల్స్, నోట్‌బుక్ LM & 2TB క్లౌడ్ స్టోరేజ్ లభిస్తాయి. ఈ సేవలను తొలుత 18-25 ఏళ్ల Jio 5G యూజర్లకు అందించి.. ఆ తర్వాత అందరికీ విస్తరించనున్నారు. ‘AI సేవలను ప్రతి భారతీయుడికి అందించడమే లక్ష్యం’ అని ఇరు సంస్థలు తెలిపాయి.