News February 18, 2025

NGKL: రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. జాగ్రత్త

image

నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పెద్దకొత్తపల్లి, తెలకపల్లి, అచ్చంపేట, ఉప్పునుంతల మండలాలలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 34 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఫిబ్రవరి మాసంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. ముందు ముందు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Similar News

News December 15, 2025

హింస, ద్వేషం ఆస్ట్రేలియాను విభజించలేవు: ప్రధాని అల్బనీస్

image

బాండీ బీచ్ వద్ద <<18561798>>ఉగ్రదాడి<<>> బాధితులకు అండగా ఉంటామని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తెలిపారు. హింస, ద్వేషం ఆస్ట్రేలియాను విభజించలేవని, దీటుగా ఎదుర్కొంటామన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పీఎం మృతులకు నివాళి అర్పించారు. ఉగ్రదాడి నేపథ్యంలో బాండీ బీచ్ వైపు వెళ్లే దారులను పోలీసులు మూసివేశారు. ఈ దాడిలో మరణాల సంఖ్య 16కు చేరగా 42 మంది గాయపడ్డారు.

News December 15, 2025

గోదాదేవి రచించిన పాశురాల గురించి తెలుసా?

image

దైవారాధనకు కఠిన దీక్షలు అవసరం లేదని, స్వచ్ఛమైన ప్రేమతో కూడా దేవుడిని వశం చేసుకోవచ్చని గోదాదేవి నిరూపించింది. ఆమె అత్యంత సులభమైన వ్రతాన్ని ఆచరించి కృష్ణుడిని భర్తగా పొందింది. తాను ధరించిన పూల మాలను కృష్ణుడికి సమర్పించింది. ఆమె రచించిన 30 పాశురాలనే ‘తిరుప్పావై’ అంటారు. పెళ్లికాని యువతులు రోజుకొకటి చొప్పున 30 పాశురాలు ఆలపిస్తే సద్గుణాల భర్త వస్తాడట. రేపటి నుంచి భక్తి కేటగిరీలో పాశురాలను చూడొచ్చు.

News December 15, 2025

కోళ్లకు వ్యాధుల ముప్పు తగ్గాలంటే?

image

ఏదైనా కోడిలో వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే మిగిలిన కోళ్ల నుంచి దాన్ని వేరుచేయాలి. వ్యాధితో ఏదైనా కోడి చనిపోతే దాన్ని దూరంగా లోతైన గుంతలో పూడ్చిపెట్టాలి లేదా కాల్చేయాలి. కోళ్ల షెడ్డులోకి వెళ్లేవారు నిపుణులు సూచించిన క్రిమిసంహారక ద్రావణంలో కాళ్లు కడుక్కున్న తర్వాతే వెళ్లాలి. కోడికి మేతపెట్టే తొట్టెలు, నీటితొట్టెలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. షెడ్డులో లిట్టరును గమనిస్తూ అవసరమైతే మారుస్తుండాలి.