News March 2, 2026

NGKL: లైసెన్స్ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించండి

image

నాగర్‌కర్నూల్ జిల్లా లైసెన్స్ సర్వేయర్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా సర్వే అధికారి గిరిధర్ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడు మల్లేష్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఉన్నటువంటి లైసెన్స్ సర్వేయర్ల సమస్యలను పరిష్కరించి ఆర్థిక భరోసా, భద్రతను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, దినేష్ మల్లికార్జున్, అరవింద్, శివుడు ప్రశాంత్, శ్రీకాంత్, రమేష్, సుమంత్ సర్వేయర్లు పాల్గొన్నారు.

Similar News

News March 2, 2026

ఇరాన్ వార్.. ఇండియా వైఖరి మారిందా?

image

ఇజ్రాయెల్‌తో మోదీ క్లోజ్ రిలేషన్, ఇరాన్ సుప్రీం ఖమేనీ మృతిపై ఇండియా సైలెన్స్.. ఇవన్నీ చూస్తుంటే భారత్ ఈసారి ఒక సైడ్ తీసుకుందని కొంతమంది డౌట్ వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా పవర్‌ఫుల్ సైడ్ వైపు మొగ్గు చూపుతోందని విశ్లేషిస్తున్నారు. UAEకి సంఘీభావం తెలపడం, ఖమేనీ మరణంపై సంతాపం ప్రకటించకపోవడం ఈ మార్పుకు నిదర్శనాలనే వాదనను ముందుంచుతున్నారు.

News March 2, 2026

శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్‌కు 56 అర్జీలు

image

శ్రీకాకుళం ఎస్పీ కార్యలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమానికి 56 ఫిర్యాదులు వచ్చాయి. వీటి పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. తన దృష్టికి వచ్చిన అర్జీలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నామని చెప్పారు. వారితో ముఖాముఖి మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.

News March 2, 2026

కడప జిల్లాలో 34 సెంటర్లలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు.!

image

కడప జిల్లాలో సోమవారం నుంచి 34 సెంటర్లలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 5,884 మంది రెగ్యులర్, 619 మంది సప్లిమెంటరీ, మొత్తం 6,503 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. సోమవారం ఇంగ్లిష్ పరీక్షకు 5,424 మంది విద్యార్థులు హాజరయ్యారు. 635 మంది ఆబ్సెంట్ అయ్యారు. కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేల్, మైదుకూరు, కమలాపురంలోని 34 ప్రభుత్వ హైస్కూళ్లలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.