News February 13, 2025

NGKL: విద్యుత్ టవర్‌కు ఉరేసుకున్నాడు

image

మనస్తాపంతో యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. తిమ్మాజిపేట మం. కోడుపర్తికి చెందిన సురేశ్(21) తల్లి పేరుపై ఉన్న భూమిని పదేళ్ల కింద గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి పట్టా చేసుకున్నాడు. తమకు ఇస్తానన్న భూమి ఇప్పటికీ ఇవ్వకపోవడంతో సురేశ్ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపం చెందిన సురేశ్ నిన్న ఇంట్లోంచి వెళ్లి పొలం వద్ద విద్యుత్ స్తంభానికి రేసుకున్నాడు. ఈమేరకు మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

Similar News

News February 13, 2025

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. నెల్లూరు జిల్లాలో చెక్‌పోస్టుల ఏర్పాటు

image

నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ సోకకుండా చర్యలు తీసుకున్నామని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ నాయక్ తెలిపారు. మనుబోలు పశు వైద్యశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేసి మాట్లాడారు. జిల్లాలో ఆరు చోట్ల చెక్‌పోస్ట్‌ల నుంచి ఇతర జిల్లాల నుంచి కోళ్ల రవాణాను అడ్డుకుంటామన్నారు. ఉడికించిన మాంసం, గుడ్లను నిర్భయంగా తినవచ్చు అన్నారు.

News February 13, 2025

అప్పుడు పంత్‌ను కాపాడి.. ఇప్పుడు చావుతో పోరాడుతున్నాడు

image

2022లో ఘోర రోడ్డు ప్రమాదం నుంచి క్రికెటర్ రిషభ్ పంత్‌ను కాపాడిన యూపీ యువకుడు రజత్(21) ప్రస్తుతం చావుతో పోరాడుతున్నాడు. తమ పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదని ఈనెల 9న ప్రియురాలు మన్నూతో కలిసి అతడు విషం తాగాడు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిద్దరినీ ఉత్తరాఖండ్‌లోని రూర్కీ ఆసుపత్రిలో చేర్చించారు. ఈక్రమంలోనే నిన్న మన్నూ మృతి చెందగా రజత్ పరిస్థితి విషమంగా ఉంది.

News February 13, 2025

వంశీ అరెస్టు సరికాదు: బొత్స

image

AP: మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టును ఖండిస్తున్నట్లు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఉపసంహరించుకున్న కేసులో అరెస్ట్ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కక్షపూరిత రాజకీయాలు తగవన్నారు. తొమ్మిది నెలల అధికారాన్ని కూటమి ప్రభుత్వం వృథా చేసిందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ బూటకమేనని విమర్శించారు.

error: Content is protected !!